Home తాజా వార్తలు మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

Enumamula-Market

వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు చేసిన పంట సొమ్మును ఇప్పించాలని రైతులు ధర్నాకు దిగారు. ఆ మార్కెట్ రెండు గేట్లకు తాళాలు వేసి రైతులు నిరసన చేపట్టారు. ఎనుమాముల మార్కెట్ వద్ద మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మహిళా రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా ఇతర రైతులు అడ్డుకున్నారు. దివ్యజ్యోతి ట్రేడర్స్ నిర్వాహకులు పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలను కొనుగోలు చేశారు. ఆరు కోట్ల రూపాయల మేర   రైతుల పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా దివ్యజ్యోతి ట్రేడర్స్ నిర్వాహకులు పరారయ్యారు. నెలరోజుల క్రితం కూడా ఇంతెజార్‌గాంజ్ పోలీస్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. అధికారుల సూచన మేరకు రైతులు వర్థన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వర్థన్నపేట నియోజకవర్గంలోని వందలాది మంది రైతులు పంటలను అమ్మారు. రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.