Home ఆదిలాబాద్ అప్పుల బాధతో ఇద్దరి రైతుల ఆత్మహత్య

అప్పుల బాధతో ఇద్దరి రైతుల ఆత్మహత్య

adilabad-1రేవోజి పేటలో టేకు చెట్టుకు
వేలాడుతున్న రైతు
రాజమల్లు మృత దేహం
కడెం: మండలంలోని రేవోజిపేట్ గ్రామ పంచాయతీకి చెందిన రైతు మెంగని రాజమల్లు(40) ఆదివారం తెల్లవారు జామును ఊరు చివరన ఉన్న టేకు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామస్థులు, కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రేవోజిపేటకు చెందిన మెంగని రాజమల్లు, రాజవ్వ దంపతులు. వీరికి మనోజ్, మంజుల కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. వీరికి ఉన్న రెండకరాలు భూమిలో సాగు చేసుకుంటూ జీవనం గడిపే వారు. కాగా ఆ రెండకెరాల భూమిలో పంట దిగుబడి లేక అప్పుల బాధకు ఆ భూమి అమ్మేశాడు. ఈ క్రమంలో 35 గుంటల భూమిని కోనుగోలు చేసుకొని దానితో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు చేసుకుంటూ ఉన్నాడు. కాగా పంట దిగుబడి లేకపోవడంతో పెట్టుబడి ఎక్కువై అప్పులు దాదాపుగా రూ. ఆరు లక్షల వరకు అయ్యాయి. అప్పులను ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై ఆదివారం తెల్లవారు జామున 3 గం. నుండి 4 గం. ప్రాంతంలో ఊరు చివరన ఉన్న టేకు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని కడెం ఎస్సై జీజుల రాము పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన రైతు రాజమల్లు కుటుంబానికి ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా అందించి అన్ని రకాలుగా ఆదుకోవాలని సర్పంచ్‌లు దండ రాజ్ కుమార్, హన్మగౌడ్ నాయకులు ఐలయ్య, దిటి సత్యం, స్థానిక నాయకులు పేర్కొన్నారు. రైతు రాజమల్లు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
బజార్‌హత్నూరు మండలం పిప్రి గ్రామంలో మరొకరు
బజార్‌హత్నూర్: మండలంలోని పిప్రి గ్రామంలో అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి కుశన్‌పెల్లి చిన్న భూ మన్న(45) ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆది వా రం మృతి చెందాడు. ఎస్‌ఐ పెద్దపల్లి చంద్రశేఖర్ తెలిపిన వివ రాల ప్రకారం భూమన్నకు మూడు ఎకరాల సొంతభూమి, 3 ఎకరాల కౌలు భూమిలో సోయా,పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఇందు కోసం దాదాపు రెండు లక్షల రూపాయలు అప్పులు చేయగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి రాకపోవడంతో గురువారం పంట పొలాన్ని చూసి మనస్థాపం చెందిన భూమన్న పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటహుటిన ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందు తూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.