Home రంగారెడ్డి అప్పుల బాధతో  ఇద్దరు రైతుల మృతి

అప్పుల బాధతో  ఇద్దరు రైతుల మృతి

ఫ్యాన్‌కు ఉరేసుకుని ఇంట్లోనే రైతు అత్మహత్య
రెండేళ్లుగా పంటలు పండట్లేదని మనస్తాపం
గుండె పోటుతో పూడూరు మండలంలోని కొత్తపేటలో ఓ రైతు మృతి

FARMER-SUICIDEమర్పల్లి: గత రెండు సంవత్సరాలుగా వర్షాలులెక, పంటలుపండటం లెదని పంటలకు పెట్టిన ఖర్చులు, పెట్టుబడులు ఎలాతిర్చాలని మనస్తాపంలో ఓయువరైతు అప్పుల బాదతో ఇంట్లోనే ప్యాన్‌కు ఉరివేసుకోని అత్మహత్య చేసుకోన్న సంఘటన మర్పల్లి మండలపరిదిలోని కోటమర్పల్లి గ్రామంలో అదివారం రాత్రి చోటుచెసుకుంది.మర్పల్లి ఎస్‌ఐ నాగభూషణం, కుటుంభ సభ్యుల కథనం ప్రకారం వివరాలీలాఉన్నాయి. గ్రామానికి చేందిన మెట్లకుంట కరుణాకర్‌రెడ్డి లక్ష్మిలు దంపతులు విరికి స్వంతంగా ఎకరపోలం ఉండగా విరిఅన్న అయిన నర్సింహ్మ రెడ్డికి చెందిన ఎకరం పొలంతోపాటు అదే గ్రామానికి చెందిన బిచ్చిరెడ్డికి చెందిన మరో రెండు ఎకరాల పొలాన్ని మెత్తం నాలుగు ఎకరాలను సాగుచెస్తు జీవనం గడుపుతున్నారు. గత రెండు సంవత్సరా లుగా ఈపొలాల్లో పత్తి, మొక్కజొన్న, క్యారట్ పంట లను పండించిన సరైనసమయంలో వర్షాలు లెక పంటలు పండలెదు.పంట పెట్టుబడుల కోసం మర్పల్లి అంద్రాబ్యాంకులో 20వేలు,ప్రయివేటుగా 2లక్షల అప్పులు చెసారు. ఈ అప్పుల విషయమై బార్య లక్ష్మి తో ఎప్పడు మాట్లాడుతూ మనోవెదనతోనే మాట్లాడె వారని బార్యలక్ష్మి విలపిస్తు తెలిపింది. అదివారం రోజున బార్య లక్ష్మితన ఇద్దరుఅడ కూతుళ్ళైన సంస్కృతిని, హర్షిని తిసుకోని తనపుట్టిని ల్లైన మెదక్ జిల్లా జిన్నారం మండలం బోంతపల్లి గ్రామానికి వెల్లింది. అమ్మ, నాన్నా లైన ఈశ్వరమ్మ, నారాయణ్ రెడ్డిలు ఇంకోక్క కుమారుడైన నర్సింహ్మరెడ్డి నివాసముంటున్న జహీరాబాద్‌పట్టణానికి వెల్లారు. దింతో అయనకు ఎమనిపించిందో ఎమోకాని రాత్రి తన ఇంట్లోనే ప్యానుకు తన లుంగితో ఉరివేసు కున్నా డు. జేబులో మాత్రం తన బిడ్డలబాద్యత బార్య అమ్మ నాన్నలదే ,పంటలువెస్తె పండలెదు. అప్పుల బాదలు ఎక్కువయ్యాయి అనే చిట్టివ్రాసిఉంది.బార్య లక్ష్మి పిర్యాదు మెరకు,శవానికి మర్పల్లి అసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసునమొదుచెసుకోని దర్యాప్తుచెస్తున్నట్టు ఎస్‌ఐ నాగభూషణం తెలిపారు.
కొత్తపల్లిలో గుండె పోటుతో ఓ రైతు మృతి …
పూడూరు: అప్పుల బాధలు భరించ లేక ఓ రైతు గుం డె పోటుతో మృతి చెందిన సంఘటన పూడూరు మం డల పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో సోమ వారం జరిగింది. చన్‌గోములు పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ చంద్రయ్య, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామ పంచాయ తికి చెందిన చెట్టుకింది నర్సింహ్మారెడ్డి(65) కి గ్రామ సమీపంలో 4 ఎకరాల 38 గుంటల వ్యవసా య భూ మి ఉంది అందులో ఈ ఏడాది పత్తి పంటను సాగు చేశారు. అందుకోసం పూడూరు ఎస్‌బిహెచ్ బ్యాంక్ లో లక్ష రూపాయలు అప్పు తెచ్చాడు. పంటల సాగు తో పాటు కుటుంబ అవసరాలకు ఫ్రైయివేట్ వ్యక్తుల దగ్గర మరో 5 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ సారి సకాలంలో వర్షాలు కురువక పత్తి పంట పండలేదు. చేసిన అప్పులను ఏలా తీర్చాలని మనో వేధనకు కుర య్యాడు. తనకు బార్య లక్ష్మమ్మ, శ్రీలత, రమాదేవి, సుజాతలు ముగ్గురు కూతూళ్లు, ఇద్దరి కూమారులలో పెద్దవాడు మైపాల్‌రెడ్డి గత సంవత్సరంలో అనా రోగ్యంతో చనిపోయాడు. రెండవ కుమారుడు జయ పాల్‌రెడ్డి వ్యవసాయంలో తండ్రికి సహాకరిస్తున్నాడు. పిల్లలలు పెళ్లీడు వచ్చిన ఇప్పటి వరకు ఎవరికి పెళ్లిళ్లు చేయలేదు. ఆశించిన స్థాయిలో పంటలు పండక, కుటుంబాని ఏలా పోషించాలని , పిల్ల పెళ్లిళ్లు చేయక నర్సింహ్మారెడ్డి రోజు రోజుకు మనోవేధనకు గురై ఆలో చన, ఫికరుతో బాధపడుతుండేవాడు. సోమవారం నర్సింహ్మారెడ్డికి గుండె పోటు రావడంతో వికారాబా ద్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ విషమిం చడంతో నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలి స్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతిని బార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు చన్‌గోములు పోలీస్ స్టేషన్ ఎఎస్‌ఐ చంద్ర య్య సంఘటన స్థలానికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని శవానికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోద్ చేసుకోని దర్యాప్తు జర్పుతున్నట్లు తెలిపారు. జడ్‌పిటిసి సిహెచ్ సంధ్యా రెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, అనంత్‌రెడ్డి టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రెడి తదితరులు కుటుంబ సభ్యులను పరమర్శించారు.