Home రాష్ట్ర వార్తలు సేద్యంలో మృత్యు ధ్వని

సేద్యంలో మృత్యు ధ్వని

ఆగని రైతుల ఆత్మహత్యలు
FARMERజిల్లాల నుంచి మన తెలంగాణ ప్రతినిధులు : అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. పంటలు పోయి అప్పులు ఒత్తిడితో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో బుధ వారం ఆరు గురు రైతులు మృతి చెందారు. వీరిలో నలుగురు ఆత్మ హత్య చేసుకోగా, మహిళతో సహా ఇద్దరు గుండె పోటుతో ప్రాణాలు విడిచారు. మృతి చెందిన రైతుల్లో కరీంనగర్ జిల్లాకు చెం దిన ఇద్దరు, నల్లగొండ, మెదక్, వరంగల్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉండగా, మహిళా రైతు నిజామాబాద్ జిల్లా వాసి. కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి మాధవరావు (55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తన చేన్లో వేసిన మిర్చి పంట చేతికొచ్చే పరిస్థితి లేక, చేసిన అప్పులు తీరే దారి కని పించక బలవన్మరణానికి పాల్ప డ్డారు. ఇదే జిల్లా జమ్మి కుంట మండలం గండ్రపల్లి వాసి గాజె సంపత్ (55) గుండెపోటుతో మృతి చెందారు. పంట దెబ్బతిని, అప్పు లు పెరిగిపోయి తీవ్ర మనస్తా పానికి గురైన ఆయన బుధ వారం గుండె ఆగి ప్రాణాలు విడిచారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు శివు నూరి హన్మవ్వ (45) గుండెపోటుతో మృతి చెందారు. తనకున్న మూడెక రాలలో వేసిన పంట, బోరుబావులు ఎండిపోవడంతో మనోవేదనకు గురైన ఆమె గుండె ఆగి ప్రాణాలు కోల్పోయారు. ఈమెకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల శివారు కొత్తపేటలో గుండమైన రమేశ్ (32)అనే యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి, మొక్క జొన్న పంటలు ఎండిపోవడం, ఇటీవలే పశువులు కూడా చనిపోవడం, చేసిన అప్పులు తీరే దారి లేక బల వన్మరణానికి పాల్ప డ్డారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. వరంగల్ జిల్లా కురవి మండలం నేరడ శివారు బంజ తండాలో భూక్యా నగేశ్ (32)యువ రైతు ఉరే సుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వరి, పత్తి, మిర్చి పంటలు వేయగా, అవి పూర్తిగా ఎండిపోయాయి. అప్పులు పెరిగి పోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే, నల్లగొండ జిల్లా కోదాడ మండలం కాపుగల్లులో కాసాని నాగరాజు (30) అనే యువ రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకు న్నారు. తనకున్న రెండు న్నర ఎకరాల నిమ్మతోటలోని బోరు బావి ఎండిపోవడం, మరోటి తవ్వించినా నీరు పడక పోవడం, అప్పులు తీరే దారి కనిపించక ఇంట్లో ఉరేసుకుని తనువు చాలించారు.