Home తాజా వార్తలు మొసలిని బంధించిన రైతులు

మొసలిని బంధించిన రైతులు

Crocodile

 

వనపర్తి : కొత్తకోట మండల పరిధిలోని భూత్కూర్ గ్రామ శివారులోని రైతుల పంట పొలాల్లోకి శనివారం మొసలి రావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. పొలాల దగ్గరికి వెల్లిన రైతులు ఈ విషయాన్ని గమనించి రైతులు వెంటనే తమ వద్ద ఉన్న తాళ్లతో చాకచక్యంగా మొసలిని బంధించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం సంబంధిత అటవీ శాఖాధికారులకు వెంటనే సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖాధికారులు మొసలిని తాళ్లతో బంధించి వాహనంలో తీసుకెళ్లారు.

Farmers who captured the Crocodile