Home ఖమ్మం కొత్త సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాం..

కొత్త సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాం..

Farmers won on anti farm law says minister puvvada

 

హైదరాబాద్: ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న పట్ల ఖమ్మం జిల్లా తెలంగాణ భవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశనుసారం బాంబులు పేల్చి, స్విట్లు తినిపించుకున్నారు. రైతులు, రైతు సంఘాల నాయుకులు, ఖమ్మం జిల్లా తెరాస నాయుకులు, కార్యకర్తలు, అన్నదాత‌లు విజ‌యం సాధించారని ఆయన తెలిపారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం దిగివ‌చ్చింది. కొత్త సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించింది. మూడు నూత‌న రైతు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. ఇవాళ ప్ర‌ధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌యాల్లోనూ వెన‌క్కి త‌గ్గ‌ని మోదీ స‌ర్కార్‌.. అన్న‌దాత‌ల ఆగ్ర‌హానికి త‌లొగ్గింది. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు.. నూత‌న సాగు చ‌ట్టాల‌ను రైతులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. కిసాన్ ఉద్య‌మాలు హోరెత్తించాయి. ముఖ్యంగా పంజాబ్‌, హ‌ర్యానా రైతులు ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌తో ఇక ఆనందంలో తేలారు. సిఎం కెసిఆర్ నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కార్ కూడా రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా భారీ ఉద్య‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. గురు నానక్ గురుపరబ్ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఇవాళ ఉద‌య‌మే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రైతు చ‌ట్టాల ర‌ద్దుపై తీర్మానం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Farmers won on anti farm law says minister puvvada