Wednesday, March 22, 2023

సేద్యపు కుంటలు..సిరుల పంటలు

- Advertisement -

water

మన తెలంగాణ/కోహెడ : భూగర్భ జలాలు పెంపొందించే లక్షంతో రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటి సంరక్షణ చర్యలు రైతులకు భరోసానిస్తున్నాయి. ముఖ్యంగా నీరు తక్కువగా ఉన్న రైతులు వీటిని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి సాగుకు వినియోగించుకుంటున్నారు. ప్రతి వర్షపు చుక్కను నిల్వ చేసుకునే ఉద్దేశ్యంతో రైతులు తమ పొలంలోనే నీటి కుంటలు ఏర్పాటు చేసుకునేందుకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కం కింద సేద్యపు కుం టలు తవ్వారు. కుంటల నిర్మణంలో పంట దిగుబడులు పెరగడానికి ఆస్కా రం ఉంది. వర్షాలు సమృద్ధి గా కురువకపోయినా కుంటలోని నీటి ద్వారా అడపాదడప పంటల సాగుకు అవసరమయ్యే నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఎండల తీవ్ర  తకు భూగర్బ జలం నీటిమట్టం పడిపోకుండా ఉంటుంది. రైతులకు 5 ఎకరాలు ఉంటే ఈ పథకానికి అర్హులు. వీటి నిర్మాణాలకు రూ.40వేల నుంచి రూ,లక్ష వరకు ఖర్చవుతుందని ఈజీఎస్ ఆధికారులు పేర్కొంటున్నారు. ఈ మొత్తన్ని ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా కూలీలకు చెల్లిస్తారు.రైతు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన ఆవసరం లేదు.వ ర్షాకాలంలో నీటిని నీల్వ చేసుకునేందుకు పంట సాగుకు నీరు వృథా కాకుండా అవసరమైన మేర ఉపయోగించుకునేందుకు సేద్యపు నీటి కుంటలు ఎంగానో దోహదపడతాయి.మండలంలో గత సంవత్సరం 735 మంజూరు కాగా అందులో 35 నిర్మాణాలు పూర్తయ్యాయి.199 నిర్మణాలు ప్రగతిలో ఉన్నాయి. వీటి నిర్మాణాల లక్షల ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు జాబ్‌కార్డు,పట్టదారు పాస్‌పుస్తకం, సన్న, చిన్నకారు సర్టిపికేట్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లతో ఉపాధిహామీ ఆధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి.
ఉపాధిహామీకి అనుసందనం.. : జాతీయ గ్రామీణ ఉపాధిహామీకి అనుసందనం చేస్తే మంచి ఫలితాలు సమకురుతాయని భావించిన ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించింది. సాగునీటి ప్రదాన కాల్వలు, ఉపకాల్వల్లో పూడికతీయడం, చెక్‌డ్యాంల నిర్మాణం, వరద కట్టాల ఏర్పాటు, ఇంకు డు గుంతలతో పాటు పోలాల్లో సేద్యపు కుంటల తవ్వకం, పనులను అనుసందానించింది. కూలీలకు పని కల్పించడమే గాకా రైతులకు సాగునీటి సమస్యలు పరిష్కరమవుతాయి.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి : శిరీష,ఎపీఓ,కోహెడ
సేద్యపుకుంటల నిర్మాణంలో రైతుల పోలాల్లో భూగర్బ జలాల నీటి మ ట్టం పెరిగి నీటి సమస్య దూరమయ్యే ఆవకాశముంది.జాబ్‌కార్డులున్న ప్రతి ఒక్క రైతు ఫీల్డ్‌అసిస్టేంట్ వద్ద దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి నిర్మాణం చేపడతాం.పొలంలో స్థలం అనువుగా ఉంటే సరిపోతుంది. రైతులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సేద్యపు నీటి కుం టల నిర్మాణాల విషయంలో రైతులు అవగహణ పెంచుకోవాలి.వీటి ని ర్మాణాలతో నీటి నిల్వాలు పెరిగి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. భూగర్బ జలాల అభివృద్ధి చెందుతాయి. అర్హులైన రైతులు నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News