Home తాజా వార్తలు వ్యవసాయం లాభసాటిగా మారితేనే అన్నదాతకు మేలు

వ్యవసాయం లాభసాటిగా మారితేనే అన్నదాతకు మేలు

farmer

 

సంగారెడ్డి : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నప్పుడే అన్నదాతకు మేలు కలుగుతుంది. వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది. ప్రాచీన పద్ధతుల ను అ వలంభించడం ద్వారా రైతుకు నష్టమే త ప్ప లాభం ఉండదు. అలాకాకుండా అ ధునాతన పద్ధతులను ఉపయోగించుకోవడంతో పాటు అదను చూసి, మార్కెట్ లో డిమాండ్‌ను ఆధారంగా పంటలను సాగు చే యాలి. తద్వారా మార్కెటింగ్ సమస్య లు లేకుండా చేసుకోవాలి. అప్పుడే రైతు కు మేలు కలుగుతుంది. అన్నదాతకు అ ప్పుల బాధ తప్పుతుంది. జి ల్లా వ్యవసా య శాఖ ఈ దిశలో ఆలోచన చేస్తోం ది. జిల్లా వ్యవసాయ శాఖ రైతు ఉత్పత్తిదారు సహకార సంఘం ఆధ్వర్యంలో రాయికోడ్ డివిజన్ సమావేశం జరిగింది.

శనివారం జరిగిన ఈ సమావేశంలో రైతు సమస్యలపై అధికారులు చర్చించారు. మిషన్ వరము అనే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశంజరిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకునేందుకు రైతులు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హన్మంతరావు అన్నారు.స్వల్ప పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడం ద్వారానే అన్నదాతకు మేలు కలుగుతుందన్నారు.రైతులంతా కలిసి వ్యసాయం చేస్తే..ఖర్చులు తగ్గుతాయని, మార్కెటింగ్ సునాయాసమవుతుందని, గిట్టుబాటు ధర సమస్య ఉండబోదన్నారు.అభివృద్ది బాటలో సాగి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. రైతు ఉత్పత్తి దారు సహకార సంఘం తన లక్షంగా ఇవే అంశాలు పెట్టుకోవాలన్నారు.ఆత్మ అనే కమిటీలను ప్రభుత్వం దీని కోసమే ఏర్పాటు చేసిందన్నారు.

వ్యవసాయ అనుబంధ శాఖలన్ని కలిసి రైతుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలని, అది వినియోగించుకునే విధంగా రైతును ప్రోత్సహించాలన్నారు.తగినన్ని మెళకువలు కూడా నేర్పించాలన్నారు.అవగాహన కల్పించడం ద్వారా రైతుకు లాభం కలిగించాలన్నారు.రైతుల్లో నమ్మకం కలిగిస్తేనే ఇది సాధ్యమన్నారు. రైతు ఉత్పత్తి దారు సహకార సంఘంతో అధికారులు కలిసి విజయం సాధించాలన్నారు. పంటల మీద అవగాహనే ప్రధానమన్నారు.

ఏ పంట ఎప్పుడు వేస్తే లాభమో అవగాహన కలిగిస్తే…సగం లాభం అక్కడే కలుగుతుందన్నారు.వాతావరణ సమస్యలు, పురుగు మందుల వినియోగం తదితర అంశాలపై అవగాన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు.రైతుకు కావాల్సిన సమాచారాన్ని అందించినప్పుడే అతనిలో నమ్మకం కలుగుతుందన్నారు.ఆత్మకు అన్ని ప్రభుత్వ శాఖల సహకారం లభించేలా చొరవ తీసుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు,డీఆర్‌డివో పీడి శ్రీనివాసరావు, హరిత, సునిత పాల్గొన్నారు.

Farming is good for farmer only if it becomes profitable