Home సినిమా కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

Fashion-Designer

వంశీ దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’. ఈ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేయబోతున్నారు. 30 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్రానికిది సీక్వెల్. సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్శ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలిచి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “వంశీ అభిమానులు, ఈ తరం యువతను అలరించే విధంగా సినిమా ఉంటుంది. ఇది ఒక మ్యూజికల్ కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ”అని అన్నారు. అప్పటి లేడీస్ టైలర్ రాజేంద్రప్రసాద్ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడు? అన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం కడుపుబ్బ నవ్వుకునే కామెడీతో తెరకెక్కించామని చిత్ర దర్శకుడు వంశీ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః నగేష్ బన్నెల్, ఎడిటర్‌ః బస్వా పైడిరెడ్డి, ఆర్ట్‌ః డి.వై.సత్యనారాయణ, మాటలుః కళ్యాణ్ రాఘవ్, పాటలుః శ్రీమణి, చైతన్యప్రసాద్, శ్రీవల్లి.