Home తాజా వార్తలు ఫాస్ట్‌పుడ్ సెంటర్‌లు … ఫాస్ట్ కిల్లర్స్

ఫాస్ట్‌పుడ్ సెంటర్‌లు … ఫాస్ట్ కిల్లర్స్

Fast Food Centers ... Fast Killersమణుగూరు (భద్రాద్రి కొత్తగూడెం): అసలే కంప్యూటర్ యూగం, మారుతున్న కాలంతో మనిషి జీవన విధానాలనే మార్చేసింది. ఉరుకుల పరుగుల జీవితంలో నేటి తరం ప్రజలు ఇళ్లల్లో ఆహర పదార్ధాలు వండుకునే పరిస్ధితే లేదు. ఆర్ధిక అవసరాలు విపరీతంగా పేరగడంతో కుటుంబంలోని ఇద్దరు పని చేయాల్సిన పరిస్ధితుల్లో వంట చేయలేక బజార్లో అప్పటికప్పుడు దొరికే రెడీమేడ్ ఫుడ్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. దీనిని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు నగరాలు, పట్టణాలు , చివరికి  పల్లేల్లో కూడా  ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. అసలే మణుగూరు పారిశ్రామిక ప్రాంతం, దుమ్ము ధూళికి నిలయం, దానికి తోడు ప్రధాన రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న ఫాస్ట్ పుడ్ సేంటర్‌లు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. రొడ్డు పక్కన లభ్యమయ్యే ఫాస్ట్ ఫుడ్స్‌లో చికేన్ బిర్యాని, చికెన్ జాయింట్స్, నాన్‌వెజ్ నూడిల్స్, గారెలు, మసాల వడలు, మిరపాకాయ బజ్జిలు, బోండాలు, చికెన్ పకోడి, ఫిష్ ప్రై వంటి వంటకాలు  మసాల దండుగా దట్టించి అప్పటికప్పుడు ప్రత్యక్షమౌతుండటం, వండి వార్చుకునే పని లేకపోవడంతో అధిక శాతం ప్రజలు వీటినే ఇష్టపడి ఆరగిస్తున్నారు. ఈ క్రమంలో వారు అనారోగ్యం పాలవుతున్నారు. నేటి సమాజంలో ప్రధానంగా ఉధ్యోగాలకు వెళ్ళే  యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్‌కు ఆకర్షితులవుతున్నారు. అధిక లాభాలనే లక్ష్యంగా చేసుకున్న కోందరు వ్యాపారులు ఫాస్ట్ పుడ్ సెంటర్‌లో నాన్యత ప్రమాణాలు పాటించడంలేదు. నిల్వ ఉంచిన చికేన్‌ను తాజాగా ఉండేందుకు వెనిగర్ వంటి ఉత్పేరకాలు వాడుతూ ఫ్రిజ్‌లో పెట్టిమరి విక్రయిస్తున్నారు. నూడిల్స్ చేసే సమయంలో చికెన్ రంగు మార్చేందుకు ఆరెంజ్ కలర్‌ను వాడి తాజ చికేన్‌లా ప్రజలును మోసం చేస్తున్నారు. సాదారణంగా రంగులు చేతులకు అంటితేనే పోవడానికి వారం రోజులు పడుతుంది, అలాంటిది కడుపులో పడితే పరిస్ధితి ఎలా ఉంటుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాస్ట్ పుడ్ తయారు చేసేందుకు వాడే వంట నూనెలను సైతం నాణ్యమైన  వాడకుండా పామాయిల్ వంటి నూనెలనే వాడుతూ ప్రజలును రోగాల బారిన పడేస్తున్నారు. అదేవిధంగా నూడుల్స్ తయారు చేసే కళాయిలను రోజులు తరబడి కడగకుండ పాత మసిపట్టిన క్లాత్‌లతో క్లీన్ చేస్తున్నారని, అదేవిధంగా రోజులు గడిచిన చిల్లి, టమాటో సాస్‌లు వాడుతున్నా కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైన ఫుడ్ ఇన్సిపెక్టర్ స్పందించి నాణ్యత పాటించని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Fast Food Centers … Fast Killers