Thursday, March 28, 2024

సమత అత్యాచారం, హత్య కేసు.. ముగ్గురు దోషులకు ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సమత కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. గతేడాది నవంబర్ 24వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ గ్రామ సమీపంలో సమతపై షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంలు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నవంబర్ 27న ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో వేగవంతమైన విచారణ కోసం ఆదిలాబాద్ లో డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. మొత్తం 25 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ముగ్గురిని దోషులుగా తేల్చింది.

Fast Track Court Death Sentence to Samathas Accused

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News