Friday, March 29, 2024

ఫాస్టాగ్ లేకపోతే రెండింతల జరిమానా!

- Advertisement -
- Advertisement -

Fastag is otherwise twice as fine

 

పాత చట్టానికి కేంద్రం సవరణ
కొత్త చట్టాలను అమలు చేయాలని టోల్‌ప్లాజాలకు ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : మీకు ఫాస్టాగ్ (FASTag) లేదా ? ఉన్నా పనిచేయడం లేదా ? అయితే మీ జేబుకు భారీగానే చిల్లు పడినట్టే. రెండు రెట్ల జరిమానాను ముక్కు పిండి వసూలు చేసేలా రోడ్లు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పాత చట్టాలను సవరించింది. ఫాస్టాగ్ లేన్ లోకి వచ్చి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వెహికల్ కేటగిరి కింద టోల్ ఫీజును రెండు రెట్లు వసూలు చేయాలని కేంద్రం టోల్‌ఫ్లాజాలకు ఆదేశాలు జారీ చేసింది.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించడానికి..

టోల్ ప్లాజాల వద్ద రద్దీని నియత్రించడం కోసం వాహనాలు వెయిట్ చేయకుండా ఉండేందుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించడానికి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఫాస్టాగ్ కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఫాస్టాగ్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్‌ను కొనుగోలు చేశారు. అయితే గడువును కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పెంచుతూ వచ్చింది. అయినా చాలా వరకు ఫాస్టాగ్ లేకుండానే వాహనాలు హైవేలపై తిరుగుతున్నాయి. ఇక నుంచి అలా కుదరదని ఫాస్టాగ్ లేని వారి నుంచి టోల్‌ఫీజును రెండు రెట్లు అధికంగా వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

టోల్ ప్లాజా వద్ద ఆగకుండా నేరుగా..

ఫాస్టాగ్ ఉంటే వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ఈ సౌకర్యం కలిగిన వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. దేశంలోని 23 బ్యాంకులతో పాటు, నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్స్ మెషిన్లు, ఎంపిక చేసిన ఏజెన్సీలు, బ్యాంకు బ్రాంచీల నుంచి ఫాస్టాగ్‌లను కొనుక్కోవచ్చు.

వాహనదారులు రూ. 200 చెల్లించి, వన్ టైం జాయినింగ్ ఫీజు చెల్లించి, కేవైసి పత్రాలతో ఫాస్టాగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఫాస్టాగ్ స్టిక్కర్ వస్తుంది. ఈ స్టిక్కర్‌ను వాహనం ముందు భాగం అద్దానికి అతికించుకోవాల్సి ఉంటుంది. టోల్ ప్లాజా నంచి వెళ్లిన సమయంలో ఈ స్టిక్కర్ ను అక్కడున్న సిబ్బంది స్కానింగ్ చేస్తారు. ముందుగానే రిజిస్ట్రర్ చేసుకున్న ఫోన్ నెంబర్ వాలెట్ నుంచి ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అవుతాయి. వాలెట్ ను నిర్దిష్టంగా రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News