Friday, March 29, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో తండ్రి, కొడుకు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు శుక్రవారం అరెస్ట్ అయ్యారు. మహబూబ్ నగర్ కు చెందిన తండ్రి, కుమారుడు అరెస్ట్ చేశారు అధికారులు. నిందితులు మైబయ్య, కుమారుడు జనార్ధన్ ను సిట్ అరెస్ట్ చేసింది. కుమారుడిని కోసం రూ. 2లక్షలతో తండ్రి ఏఈ పేపర్ కొన్నాడు. డాక్యాకు రూ. 2లక్షలు ఇచ్చి పేపర్ కొన్నట్లు సమాచారం. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 19 మంది అరెస్ట్ అయ్యారు. మైబయ్య వికారాబాద్ లో టెక్నికల్ అసిస్టెంట్ పనిచేస్తున్నాడు.

డాక్యా నాయక్ తో పరిచయం పెంచుకున్నాడు మైబయ్య. డాక్యా నాయక్ ఏఈ పేపర్ ను రూ. 6 లక్షలకు బేరం పెట్టాడు. ఏఈ పేపర్ కు రూ. 2లక్షలు మాత్రమే ఇస్తానని మైబయ్య చెప్పాడు. డీల్ కుదరడంతో డాక్యా బ్యాంకు ఖాతాకు మైబయ్య డబ్బు బదిలీ చేశాడు. డబ్బు బదిలీ తరువాత మైబయ్య చేతికి ఏఈ పేపర్ చేరింది. కుమారుడికి ఏఈ పేపర్ ఇచ్చి మైబయ్య పరీక్ష రాయించాడు. విషయం బయటపడడంతో అరెస్ట్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News