Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో తండ్రికొడుకు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రికొడుకు మృతి

Road Accidentవనపర్తి: ఖిల్లాఘనపూర్ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తుపాను వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న తండ్రి,కొడుకు మృతి చెందారు. బైక్ ను ఢీకొట్టిన అనంతరం తుపాను వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తుపాను వాహనంలో ప్రయాణిస్తున్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులను ఖిల్లాఘనపూర్ మండల పరిధిలోని కర్నె తండాకు చెందిన కొడవత్‌ నార్య(40), తరుణ్‌(6)గా గుర్తించారు. శవ పరీక్ష కోసం తండ్రికొడుకుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Father And Son Dead In Road Accident At Wanaparthy