Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

Father and son dies in road accident at Nagarkurnoolనాగ‌ర్‌క‌ర్నూల్ : బిజినేప‌ల్లి వ‌ద్ద శుక్ర‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం జరిగింది. వేగంగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒకే బైక్‌పై ప్ర‌యాణిస్తున్న తండ్రీ కొడుకు చనిపోయారు. మ‌రో ఇద్దరు  తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.  మృతుల‌ను వ‌ట్టెం గ్రామానికి చెందిన బాల‌య్య గౌడ్ (65), శివ‌కుమార్ గౌడ్ (35)గా గుర్తంచినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం బాలయ్యగౌడ్, శివకుమార్ గౌడ్ ల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.