Home Default 17 రోజుల ఆడపిల్లను బతికుండగానే బొందపెట్టిన కన్నతండ్రి

17 రోజుల ఆడపిల్లను బతికుండగానే బొందపెట్టిన కన్నతండ్రి

Alive

 

చెన్నై: తమిళనాడు రాష్ట్రం విల్లుపురం ప్రాంతంలో ఆడపిల్ల పుట్టిన 17 రోజులకే ఆ పసికందును బతికుండగానే సజీవ సమాధి చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ నిందితుడిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వడమరుతూర్ అనే గ్రామంలో డి వరధరాజన్ అనే వ్యక్తి సౌందర్యను గత సంవత్సరం అగష్టులో వివాహం చేసుకున్నాడు. 17 రోజుల క్రితం సౌందర్య పండంటి బిడ్డకు జన్మనించింది. వరధరాజన్ ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేకపోవడంతో పాటు అబ్బాయే కావాలని పలుమార్లు భార్యతో గొడవకు దిగాడు. పుట్టిన మూడు రోజులకు పసికందును వదిలించుకోవాలని అతడు నిర్ణయం తీసుకున్నప్పుడు… బంధువులు, తల్లిదండ్రులు చెప్పడంతో ఆ పాపకు ఎటువంటి హానికరం చేయలేదు. మంగళవారం రాత్రి 12.30 నిమిషాలకు సౌందర్య గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత పాపను ఎత్తుకెళ్లి బతికుండగానే గుంత తీసి పూడ్చాడు. భార్య తెల్లవారుజామున నాలుగు గంటల పాపలేకపోవడంతో కేకలు పెట్టింది. భర్తపై అనుమానం ఉండడంతో నిలదీసింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు తనదైన శైలిలో అడగడంతో వరధరాజన్ నిజాలు ఒప్పుకున్నాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పాప మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Varadharajan had tried to kill the baby when she was three days old, But stopped by his Relatives,

 

Father Buried alive 17 Days Old Girl in Tamilnadu