Home పెద్దపల్లి కుమారుడిని కాపాడబోయి తండ్రి మృతి

కుమారుడిని కాపాడబోయి తండ్రి మృతి

Man-Died-Saving-Son

వెల్గటూర్ : పెద్దపల్లి జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తం భంపెల్లి చెరువులో ఈదుతూ మునిగిపోతున్న కుమారుడిని కాపాడబోయి తండ్రి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్తం భంపెల్లి గ్రామానికి చెందిన గందం శ్యాంకుమార్ పాస్టర్‌గా పనిచేస్తూ పెద్ద పల్లి జిల్లా ఎలిగేడు మండలం ఈమలపేటలో నివసిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో కుమారుడితోపాటు సొంత గ్రామానికి వచ్చారు. ఇంటి ముందున్న చెట్టును కొట్టి వేసిన తరువాత స్నా నానికి తండ్రీకొడుకులు చెరువుకు వెళ్లారు. ఈతరాని మోశేష్ నీటిలో ముని గితుండగా అతడిని కాపాడడం కోసం తండ్రి ఈదుకుంటు వెళ్లాడు. చెరువు తూం లోపలికి లాగేయడంతో దుర్మరణం పాలయ్యాడు. నీట మునిగిన మోశేష్ ప్రక్కనున్న మోటారు పైపు పట్టుకుని ఒడ్డుకు చెరుకున్నాడు.  పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.