Friday, March 29, 2024

ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు.. కన్నతండ్రే హంతకుడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్య కేసును పోలీసులు చేధించారు. కన్నతండ్రీనే నిందితుడిగా తేల్చారు. సోమవారం రోజు సాయంత్రం కరీంనగర్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ పోలీసు కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి వివరాలను వెల్లఢించారు. గత నెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ముత్త రాధిక(19) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆమెను గోంతుకోసి హత్య చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు 21 రోజుల పాటు తమ విచారణ కొనసాగించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేసిన పోలీసులు హతురాలి తండ్రీ ముత్త కొమురయ్యను నిందితుడిగా తేల్చారు. కుమార్తె ఆనారోగ్యం కారణంగా ఆర్థికపరమైన భారం భరించలేక దానితోపాటు కుమార్తె ఆరోగ్యం కుదుటపడితే ఆమెకు వివాహం చేయాల్సి వస్తుంది కాబట్టి తనకు మరింతగా ఆర్థికభారం పెరుగుతుందని భావించి ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకుని హత్యచేశాడు.

ఇంట్లో రాధిక ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో ముందుగా దిండుతో ఉపిరాడకుండా చేసి తరువాత కత్తితో గొంతుకోసి హతమార్చాడు. ఏవరికి అనుమానం రాకుండా ఉండేందుకు కత్తిని శుభ్రంగా కడగడంతో పాటు తన ఒంటిపై ఉన్న బట్టలను సైతం శుభ్రం చేసుకుని ఏవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు రోధిస్తూ పోలీసుల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి చివరికి తండ్రీ ముత్త కొమురయ్య హత్యచేసినట్లు నిర్ధారణకు వచ్చి అతడిని అదుపులోనికి తీసుకుని విచారించగా తానే హత్యచేసినట్లు ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ పోలీసు కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఆయన అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ అడిషనల్ సి.పిలు ఎస్.శ్రీనివాస్, చంద్రమోహన్, ఎసిపిలు డాక్టర్ పి.ఆశోక్, శ్రీనివాస్, సిఐలు చల్లా దేవారెడ్డి, కిరణ్‌కుమార్, శశిధర్‌రెడ్డి, పి.దామోదర్‌రెడ్డి, ఎస్.బి.ఐ ఇంద్రసేనారెడ్డి సహా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Father is Accused in Inter Student Radhika murder case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News