Home తాజా వార్తలు భూ తగాదాలు : తండ్రిని చంపిన కొడుకులు

భూ తగాదాలు : తండ్రిని చంపిన కొడుకులు

Father Murder By Sons In Sangareddyసంగారెడ్డి : భూ తాగాదా కారణంగా ఓ వ్యక్తి తన కొడుకుల చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన అందోల్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాహ్మణపల్లికి చెందిన పాపయ్య (55)తో అతడి కొడుకులు భూమి విషయంలో గొడవపడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన కొడుకులు తండ్రి పాపయ్యపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పాపయ్యను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాపయ్య చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న పాపయ్య కొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.