Home తాజా వార్తలు కొడుకు కోసం తండ్రి నిరాహార దీక్ష

కొడుకు కోసం తండ్రి నిరాహార దీక్ష

father nirahara deeksha for son in nagarkurnool dist

 

కొల్లాపూర్: తన కొడుకును కిడ్నాప్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఓ తండ్రి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కోడేరు మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన మహేష అనే వ్యక్తిని తన భార్య బంధువులు కిడ్నాప్ చేశారని మహేష్ తండ్రి వెంకటస్వామి, అన్న కురుమయ్య గ్రామస్తులతో కలిసి బస్టాండ్ దగ్గర నిరాహార దీక్షకు దిగారు. వివరాల్లోకి వెళితే… మహేష్‌కు వెన్నచర్లకు చెందిన దీపికతో 2019వ సంవత్సరంలో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుండి భార్య భర్తల బంధువుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. దీంతో ఇరు కుటుంబసభ్యులు వారిని బ్రతుకుదెరువు కోసం పట్నం పంపారు. అక్కడ కూడా గొడవలు జరగడంతో భార్య తరపు బంధువులు మహేష్‌ను కొట్టి కిడ్నాప్ చేశారని తండ్రి ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని డిజిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీపిక బంధువులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ.. తమకు న్యాయం చేయాలంటూ ఆయన చేస్తున్నాడు.

father nirahara deeksha for son in nagarkurnool dist