Home తాజా వార్తలు కొడుకును హత్య చేసిన తండ్రి

కొడుకును హత్య చేసిన తండ్రి

 Murdered

 

నకిరేకల్ : రెండో పెళ్లికి అడ్డువస్తున్నాడని ఆగ్రహంతో కన్న కొడుకుని హత్య చేసిన ఉదంతంలో తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు శాలిగౌరారం సిఐ కె.కాస్ట్రోరెడ్డి, ఎస్‌ఐ రాజులు తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరం మండలం తిరుమల రాయినిగూడెం గ్రామానికి చెందిన చింతల కనకయ్య భార్య స్వప్పకు మధ్య ఆరు నెలల క్రితం కుటుంబ తగాదలు నెలకొడంతో భార్య కూతురుతో వెళ్లి ఒంటరిగా జీవనం సాగిస్తోంది.

భర్త కనకయ్య తిరుమల రాయినిగూడెంలోని తన పెదనాన్న చింతల రాములు ఇంటికి తన మూడేళ్ల బాబుతో 2 నెలల క్రితం వచ్చి జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. రెండవ పెళ్లి చేసుకోవడానికి తన ముక్కుపచ్చలారని అక్షయ్(3)ని ఈ నెల 8వ తేదీన రాత్రి సమయంలో గొంతు నులిపి, మెడను విరిచి హత్య చేశాడు. అక్షయ్ తాత చింతల రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా విచరణలో కనకయ్య నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు సిఐ కె.కాస్ట్రోరెడ్డి, ఎస్‌ఐ రాజులు తెలిపారు.

Father who Murdered his Son