Home నిజామాబాద్ కొడుకును చంపిన కసాయి తండ్రి అరెస్టు

కొడుకును చంపిన కసాయి తండ్రి అరెస్టు

Father-Arrestనందిపేట : నందిపేట మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన బట్టు సాయిలు తన నాలుగు సంవ్సరాల కోడుకు సాగర్‌ను భార్య మీద కోపంతో కోట్టి చంపాడని ఆర్మూర్ సి.ఐ. నరసింహస్వామి తెలిపారు. ఈ మేరకు సాయిలును పట్టుకోని గురువారం కోర్టులో హాజరు పరుస్తున్నట్లు అయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. నిందితుడు సాయిలుకు గొట్టు ముక్కల గ్రామానికి చెందిన అనితతో గత ఎనిమిది సంవత్సరాల క్రితం పెండ్లి అయిందని వీరికి ముగ్గురు సంతానం ఉన్నారని అయన అన్నారు. కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో వేధించేవాడు. మంగళవారం చిన్న కొడుకు సాగర్‌ను, కూతురు పల్లవిలను చిన్న పిల్లలని చూడకుండ బాగా కొట్టడంతో ఈ విషయం పక్కవారు నిందితుడు భార్యకు చెప్పడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా సాగర్ మృతి చెందినట్టు డాక్టరు చెప్పాడని సి.ఐ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు హత్యనేరం కింద కేసు నమెదు చెసినట్లు అయన తెలిపారు.