Friday, April 19, 2024

ఇండియాలో కరోనా చికిత్సకు ఫావిపిరావిర్ పరీక్షలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా చికిత్స కొరకు యాంటివైరల్ ఔషదంగా ప్రసిద్ది పొందిన ఫావిపిరావిర్‌తో పరీక్షలు మొదలు పెట్టినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ మంగళవారం ప్రకటించింది. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులపై దీని ప్రభావం అంచనా వేసి, ప్రయోగిస్తామని ఈ సంస్థ నిపుణులు పేర్కొన్నారు. ఈ మందుకు ఏప్రిల్ నెలలోనే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించిందని, ఇప్పటికే ట్రయల్స్ చేసేందుకు సిద్ధమయ్యామని సంస్థ తెలిపింది. కోవిడ్ 19 రోగులపై మొట్టమొదటి అనుమతి పొందినది తమ కంపెనీయేనని గ్లైన్‌మార్క్ బిఎస్‌ఈకి సమర్పించిన నివేదికలో పేర్కొంది.

ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా పదికి పైగాఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఈ పరీక్షలు జరుగుతున్నాయని, వచ్చే జూలై లేదా ఆగస్టు వరకు ఈ పరీక్షల ఫలితాలు వస్తాయని సంస్థ స్పష్టం చేసింది. కోవిడ్ 19 రోగులపై ఫావిపిరావిర్ ప్రభావం గురించి తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రస్తుతం కరోనా చికిత్సకు మందు లేదు కావున, తమ సంస్థ తయారు చేసిన మందుపై శాస్త్రవేత్తలు కూడా ఫలితాలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, కావున తమ ప్రయోగ అధ్యయన ఫలితాలు కీలకం అవుతాయాని గ్లెన్‌మార్క్ వైస్ ప్రెసిడెంట్, క్లినికల్ అభివృద్ధి విభాగం అధిపతి డాక్టర్ మోనికా టాండన్ మీడియతో అన్నారు. కోవిడ్ 19 చికిత్స విషయంలో ఈ అధ్యయనం తర్వాత ఒక స్పష్టత వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Favipiravir tests begins for corona treatment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News