Home ఆఫ్ బీట్ యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్

యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్

Featured with Android version for Android users

వాట్సాప్ ఇన్‌స్టంట్ మెసెంజర్ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. మిగతా మెసెంజర్లతో పాటే వాట్సాప్ కూడా తనదైన శైలిలో యూజర్లకు మరిన్ని ఫీచర్లను అందిస్తోంది. ఇప్పుడు తాజాగా ఎమోషన్ స్టిక్కర్స్‌ను జోడించి చాటింగ్ ప్రియులను మరింత ఆకట్టుకుంటోంది. 

ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తున్నప్పుడు మన భావాలను ఎదుటివారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకు స్టిక్కర్లకు మించిన మార్గం మరొకటి లేదు. ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ సంస్థ వాట్సప్ కూడా ఇలాంటి స్టిక్కర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తన బ్లాగ్‌లో ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వినియోగిచుకునేందుకు వీలుగా వాట్సప్ ఈ స్టిక్కర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ పార్టీ డిజైనర్లను ప్రోత్సహించేందుకు వారి ద్వారా స్టిక్కర్లను రూపొందించి, ఎంపిక చేశామని వాట్సప్ తన బ్లాగ్‌లో రాసింది. కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు స్టేబుల్ వర్షన్ తో కూడిన ఫీచర్ అందుబాటులోకి రానున్నది. అయితే కొన్ని ఐఓఎస్ యూజర్లలో ఇప్పటికే అప్ డేట్ చేసిన స్టిక్కర్ ఫీచర్ అందుబాటులో ఉంది.

డౌన్‌లోడ్ ఇలా చేసుకోవాలి..
మీరు కూడా మీ వాట్సప్‌లో స్టిక్కర్ పొందాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో వాట్సప్ లేటెస్ట్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేయండి. బీటా యూజర్లు కూడా లేటెస్ట్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ 30 ఎంబీ సైజ్ ఉంటుంది. స్టిక్కర్స్ మెనూలోకి వెళ్లి స్టిక్కర్స్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేటగిరీల ఆధారంగా స్టిక్కర్స్ అందుబాటులో ఉంటాయి.
ఆండ్రాయిడ్, ఐఫోన్లల్లో వీటిని ఉపయోగించుకోవచ్చు. వాట్సప్ ఆండ్రాయిడ్ వర్షన్ 2.18.329, ఐఓఎస్ వర్షన్ 2.18.100 డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ స్టిక్కర్స్ ఎంచక్కా కనిపిస్తాయి. టెక్ట్ట్, ఆడియో, ఎమోజీల కన్నా స్టిక్కర్స్ ఎక్కువగా ఉపయోగించేలా రూపొందించేందుకు చాలాకాలంగా వాట్సప్ కసరత్తు చేసింది. వాటిలో ఫేవరెట్ స్టిక్కర్లను స్టార్ చేసుకొని ఎప్పుడైనా పంపొచ్చు. స్టిక్కర్స్ పొందినవాళ్లు డిలిట్ చేయొచ్చు. ఎవరికైనా ఫార్వర్డ్ కూడా చేయొచ్చు.

కొత్తగా…
ఎప్పటినుండో యూట్యూబ్, ట్విట్టర్‌లో అందుబాటులో ఉన్న డార్క్ మోడ్ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి రానుంది. డార్క్ మోడ్ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే యాప్ స్క్రీన్ మొత్తం నల్లగా మారుతుంది. దీని వల్ల చీకట్లోనూ వాట్సాప్‌ను వాడినా కంటిపై ఎక్కువ ప్రభావం ఉండని వాట్సాప్ నిర్వహకులు తెలిపారు.
ప్రస్తుతం వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌లకు తిరిగి రిప్లై ఇవ్వాలంటే ఆ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి రిప్లరు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొత్తగా వస్తున్న ఫీచర్ల నేపథ్యంలో ఇక నుంచి ఆ పని ఉండదు. ఒక మెసెజ్‌కు రిప్లరు ఇవ్వాలంటే దాని స్త్వ్రప్ చేసి రిప్లరు ఇవ్వచ్చు. ఈ రెండు కొత్త ఫీచర్లు తొందర్లోనే వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
వాట్సాప్‌లో రెగ్యులర్ ఫాంట్లను మనం చూస్తూ ఉంటాం. బోల్డ్ ఇటాలిక్, స్ట్రయిక్ థ్రూ ఫాంట్లు కనిపిస్తుంటాయి. దాని కోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ అవసరం లేదు. టెక్ట్ రాసేపుడు చిన్న ఫార్ములాలు వాడితే సరిపోతుంది.

ఇటాలిక్ ఫార్మేట్
మీరు ఇటాలిక్‌లో టెక్ట్‌ను పంపాలనుకుంటే.. మీరు రాసిన మెసెజ్‌కు ముందూ, వెనక ’అండర్ స్కో(బి)’ సింబల్ రాయాలి.

బి టెకస్ట్ బి బోల్ సెలక్షన్
మీరు పంపించే టెకస్ట్ సెలెక్ట్ చేసినట్టు థిక్ గా పంపించాలంటే స్టార్(లి) సింబల్ ఉపయోగించాలి.

టెక్ట్ స్ట్రయిక్ చేసినట్టు
మీరు పంపించే టెక్ట్ కొట్టేసినట్టుగా పంపించాలంటే టిల్డె (ది) సింబల్ ఉపయోగించాలి.

ది టెక్ట్ ది మోనో స్పేస్ ఫార్మేట్
ఈ ఫార్మేట్ లో మీరు టెక్ట్ పంపించాలంటే గ్రేవ్ అసెంట్ ( % ) సింబల్ మూడు సార్లు వాడాలి.

వాట్సాప్‌లో ఆడియో కాల్స్ రికార్డ్ కూడా..
గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే క్యూబ్ కాల్ రికార్డర్ అనే యాప్ ద్వారా వాట్సప్ ఆడియో కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మామూలు ఫోన్ కాల్స్ రికార్డ్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ ఇది మీకు పని చేయకపోతే మెసెంజర్ కాల్ రికార్డర్ అనే యాప్ గూగుల్‌లో వెదికి థర్డ్ పార్టీ సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. కొన్ని కారణాల వల్ల ఈ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించారు. కొన్ని ఫోన్లలో ఆడియో సోర్స్ విషయంలో ఉన్న పరిమితుల వల్ల ఈ రెండు యాప్స్ వాట్సప్ ఆడియో కాల్ రికార్డ్ చేయకపోవచ్చు. మీ ఫోన్ లో ఉన్న హార్డ్‌వేర్ పరిమితి తప్పించి, దానికి పరిష్కారం ఏమీ లేదు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి వేర్వేరు ఆడియో సోర్స్‌లను ఎంపిక చేసుకుని ప్రయత్నించి చూడండి. అప్పటికీ ఫలితం లేకపోతే వేరే ఫోన్లో ప్రయత్నించాల్సిందే. ఇక వీడియో కాల్స్ రికార్డ్ చేసుకోవాలంటే ఎజెడ్ స్క్రీన్ రికార్డర్ వంటి యాప్స్ వాడి ఫోన్ స్క్రీన్‌ని ఉన్నది ఉన్నట్లు రికార్డు చేసుకుంటే సరిపోతుంది. సో..ఇన్ని సదుపాయాలున్న వాట్సప్‌ను చక్కగా వినియోగించుకోండి.

Featured with Android version for Android users

Telangana Latest News