Home ఆఫ్ బీట్ నగరంలో సందడి చేయనున్న ప్రేమికులు

నగరంలో సందడి చేయనున్న ప్రేమికులు

అందుబాటులో వెరైటీ గిఫ్ట్‌లు, ముస్తాబైన గిఫ్ట్ షాపులు, కనుమరుగైన పావురాలు, ఉత్తరాలు

Love-Story

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఎన్నెన్నో ప్రేమిక హృదయాలు ప్రమేమికుల రోజు కోసం పరితపిస్తుంటాయి. ఎప్పుడెప్పుడు తమ ప్రేయసి, ప్రియులకి తమ అంతరంగాన్ని తెలియజెప్పాలని ఎందరో ఉవ్విళూరుతుంటారు. ప్రత్యేకించి తమ ప్రేమను తెలియజేసి మఘవల మనుసును దోచుకునేందుకు ఎలాం టి కానుకలు  ఇవ్వాలోనని ప్రేమికులు తర్జనభర్జనకు గురవుతుంటారు. అలాంటి ప్రేమికుల దినోత్సవం  కోసం మరికొందరు కూడా ఎదురు చూస్తుంటారు. కాకపోతే వారు ప్రేమతో కాదు వ్యాపారంపై శ్రద్ధతో ప్రేమికుల కోసం ఎలాంటి విభిన్నమైన బహుమతులను సిద్ధం చేయాలో నేటి వ్యాపారులకు బాగా  తెలుసునని చెప్పవచ్చు. దీనికి నిదర్శనంగా ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ప్రేమికుల దినోత్సవ సందర్భంగా ప్రేమికుల దినోత్సవం నాడు ప్రత్యేక బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. పూర్వకాలంలో తమ ప్రేమ సందేశాన్ని పంపడానికి పావురాలను, ఉత్తరాలను వాడేవారు కానీ రాను రానూ అవి కనుమరుగై పోయా యి. ఇప్పుడిక హైటెక్ యుగం దీనికి అనుగుణంగా ప్రేమికులు తమ  ప్రేమ సందేశాన్ని తెలియజేయడానికి వివిధ రకాల కానుకలు మార్కెట్‌లోకి వచ్చాయి.

LOVE

వాలెంటైన్స్ డేకు ఆరు రోజుల ముందుగానే నగరంలో ఈ సందడి అన్ని గిఫ్ట్‌షాపుల్లో కనిపిస్తోంది. హృదయమెక్కడో లేదండి మా షాపులు చూడ రండి అన్నట్లుగా గిఫ్ట్‌షాపులు ముస్తాబయ్యాయి. వీటిలో కేవలం గ్రీటింగ్ కార్డులో, ఫ్లవర్ బోకేస్ మాత్రమే కాకుండా వెరైటీగా మనం వాడే పెన్నులు స్టాండ్ నుంచి తాగే టీ కప్పుల వరకు అన్ని ప్రేమమయమే. హృదయాకారంలో ఉన్న పెన్నుల స్టాండ్, దానిలో అమర్చిన గులాబిరేకులు మనస్సు లోతుల్ని అవిష్కరిస్తున్నాయి. ఇక ప్రేమకు పర్యాయపదంగా నిలిచేది తాజ్‌మహాల్. నేటి యువ ప్రేమికులు మాత్రం ఇంతటి తాజ్‌మహాల్‌ను కట్టించలేకపోయినా దానికన్నా విశాలమైన, విలువైన  హృదయాన్ని నీకీచ్చేస్తున్నాను దానికి సాక్షి ఇదిగో అంటూ తాజ్‌మహాల్ గిఫ్ట్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇక భాగ్యనగరం పాతబస్తీలో కొలువై ఎప్పుడూ కొత్తగా కనిపించే చార్మినార్‌ను తన ప్రేయసి బాగమతికి గుర్తుగా నిర్మించాడు ఆమె ప్రియుడు. ఈనాటి  ప్రేమికులు  మేము అంతంటి వాళ్లం కాకపోయినా వాటిని కానుకల రూపంలో మదిలో నిలుపుకొంటాం అంటూ చార్మినార్ ప్రతిరూపాల వైపు మొగ్గుచూపుతున్నారు.

ప్రేమికులు  ఎం త దూరంలో ఎడబాటు ఉన్నా  ఎప్పుడూ నా ధ్యాసలోనే ఉండాలంటే ఎలాంటి గిఫ్ట్ పంపితే బాగుంటుందో అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి ఆలోచనలను అనుగుణంగా హృదయాకారంతో ఉన్న చేతిగడియారాలు, నిద్రలో చూసి నా ఒకరికొకరు తమతోనే  ఉన్నామనే భావన కలగడానికి  హృదయాకారంలో ఉన్న దిండ్లు, తనప్రేయసి ఆభరణాలు దాచడానికి   హృదయాకారంలో ఉన్న జ్యూయలరీ బాక్స్‌లు నీకు నేను నాకు నువ్వు అంటూ ఒకరికొకరూ చేసుకునే బాస నిజమే అవడానికి తగ్గట్టుగా కానుకలు, ఇలా రకరకాలవి మార్కెట్ లో కొలువు దీరాయి. కోరుకున్న వారు చెంతనుండగా ఏది చూసినా అంతా ఆనం దం వీటిల్లో  ఏది ఎంచుకోవాలో  తెలియని అయోమయం  యువ ప్రేమికులలో మొదలైంది. గిఫ్ట్‌ల ధరలు రూ. 50 నుంచి రూ.2000 వరకు ఉన్నాయి.

LOVERS