Home తాజా వార్తలు ఆష్లే బార్టీ జయభేరి

ఆష్లే బార్టీ జయభేరి

ashleigh barty

పెర్త్ : ఫెడరేషన్ కప్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో భాగంగా శనివారం ఫ్రాన్స్ క్రీడాకారిణి కరోలైన్ గార్సియాతో జరిగిన పోరులో ఆస్ట్రేలియా స్టార్ ఆష్లే బార్టీ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ క్రీడాకారిణి బార్టీ 60, 60 తేడాతో గార్సియాను చిత్తు చేసింది. ఆరంభం నుంచే బార్టీ చెలరేగి పోయింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగింది. బార్టీ జోరుకు గార్సియా కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో బార్టీ రెండు సెట్‌లలో కూడా కనీసం ఒక్క గేమ్ కూడా కోల్పోక పోవడం విశేషం. పూర్తి ఆధిపత్యం చెలాయించిన బార్టీ సునాయాస విజయం అందుకుంది. బార్టీ గెలుపుతో ఫెడ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలు 11తో సమంగా నిలిచాయి. అంతకుముందు తొలి సింగిల్స్‌లో ఫ్రాన్స్ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాదేనొవిక్ విజయం సాధించింది.

Fed Cup Final