Home జాతీయ వార్తలు కేంద్రంలో వచ్చేది ఫెడరల్ ఫ్రంటే: మమతా

కేంద్రంలో వచ్చేది ఫెడరల్ ఫ్రంటే: మమతా

 

Mamata

 

 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నోట్లను రద్దు చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మమతా సిఎన్‌ఎన్‌ఐబిఎన్ మీడియాతో మాట్లాడారు. రైతులను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గత ఐదు సంవత్సరాల నుంచి నిరుద్యోగ శాతం బాగా పెరిగిందన్నారు. ఉజ్వల, జనధన్, స్వచ్ఛత పథకాలతో ప్రజలకు లాభం చేకూరలేదన్నారు. యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాలు కాకుండా ప్రాంతీయ పార్టీలతో కూడిన ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని జోస్యం చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ కోసమే తాము కృషి చేస్తున్నామని మమతా స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీల నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని వివరించారు. ప్రాంతీయ పార్టీల అంగీకారంతోనే ప్రధానిని ఎంచుకుంటామని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపికి ఉన్న రెండు ఎంపి సీట్లు కూడా రావాని ఎద్దేవా చేశారు. 

 

Federal Front Form in Government in India