Home రాష్ట్ర వార్తలు హాజరీని బట్టే ఫీజు

హాజరీని బట్టే ఫీజు

75% అటెండెన్స్ ఉంటేనే రీయింబర్స్‌మెంట్?

main-2హైదరాబాద్ : డిగ్రీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో లోపాలను సరిచేసే క్రమంలో భాగం గా ఫీజులకు, విద్యార్థుల హాజరు శాతానికి ప్రభుత్వం ముడిపెట్టింది. 75 శాతం హాజరు శాతం ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, అదే విధంగా పరీక్షలకు అనుమతించాలని నిర్ణ యించినట్లు తెలిసింది. ఇంజినీరింగ్ తర్వాత డిగ్రీ విద్యార్థులే అధికంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం కొన్ని ప్రైవేటు కళాశాలు అక్రమాలకు పాల్పడుతున్నారని, వాటిని అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశిం చింది. అందులో భాగంగానే ఉన్నత కళాశాల విద్యా విధానంపై హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉన్నత విద్యా మండలి ఛైర్మణ్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ కమిషనర్ ఎ. వాణిప్రసాద్, రాష్ట్రంలోని ఆరు ప్రధాన విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ విద్యావిధానంలో మార్పులు, చేర్పులపై చర్చించారు. వచ్చే ఏడాది (2016-17 విద్యా సంవత్సరం)  నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా డిగ్రీలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలనే అంశంపై చర్చించారు.  ప్రతీ కళాశాలలలో అధ్యాపకులు, విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేయనున్నారు. కళాశాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి. కళాశాల పరిస్థి తులు, విద్యార్థులు, అధ్యాపకుల హాజరు శాతాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ప్రతి నెలా విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యా మండలికి కూడా అందజేయాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరు శాతాన్ని పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని విద్యాశాఖ నిర్ణయించింది. అదే విధంగా అధ్యాపకులు తరగతి గదులలో జరిగిన క్లాసుల వివరాలను కూడా విశ్వవిద్యాలయానికి అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా సుమారు 12వందల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రతి ఏటా మొదటి సంవత్సరంలో సుమారు 2.50 లక్షల నుంచి 3 లక్ష వరకు విద్యార్థులు అడ్మిషన్లు పొందుతుండగా, ఇందులో సుమారు 90 శాతం వరకు ఫీజురియంబర్స్‌మెంట్ పొందుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయల పరిధిలోని డిగ్రీ కళాశాలకు ఒకే విధామైన విద్యా క్యాలెండర్‌ను రూపొందించి, వాటిని అమలు చేయాలని నిర్ణయించారు. దరఖాస్తుల నుంచి మొదలు సెలవులు, పరీక్ష తదితర అంశాల్లో ఒకే విధానం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  అయితే ఈ విధానంలో విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటును కూడా కల్పించచే అవకాశాలు ఉన్నాయి.