Wednesday, March 22, 2023

సమిష్టి కృషితోనే ఫైలేరియా నిర్మూళన

- Advertisement -

speak

* జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : ఫైలే రియా, నులిపురుగులను సమూలంగా ని ర్మూలించడానికి ముందస్తూ జాగ్రత్తలను తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వ ర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జాతీయ ఫైలేరియా మరియు నులిపురు గుల నిర్మూలన కార్యక్రమంపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాతీ య ఫైలేరియా, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం ఈ నెల 9 నుండి 11 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత మాత్రలను పంపిణీ చేయనున్నట్లు జేసీ పేర్కొన్నారు. పైలేరియా, నూలిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆల్‌బెండజోల్ మాత్ర వాడు చున్నందున ఈ కార్యక్రమంలో డిఇసి, అల్‌బెండజోల్ మందులు ఉప యోగిస్తారన్నారు. ప్రతి ఒక్కరు మాత్రలు వాడితే సూక్ష్మఫైలేరియా నిర్మూలనతో పాటు దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోదిం చగలుగుతామన్నారు. వ్యాధి రాకుండానే ముందస్తు జాగ్రత్త తీసుకోవా లన్నారు. ప్రతి ఒక్కరు మాత్రలు వాడితే సూక్ష్మఫైలేరియా నిర్మూలనతో పాటు దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోదించగలుగుతామ న్నారు. వ్యాధి రాకుండానే ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని, అందుకు పంపిణీ చేయనున్న పైలేరియా నివారణ మాత్రలను వివిధ వయస్సుల వారు సూచించిన మోతాదుల మేరకు వాడాలన్నారు. మాస్ డ్రగ్ అడ్మిని స్టేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 9 నుండి 11 వరకు ఉంటుందన్నారు. 9న జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, వసతిగృహాల విద్యార్థులు, అంగన్‌వాడి కేంద్రాలలోని పిల్లలకు ఈ మాత్రలను వేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి నాగయ్య, డా.శశాంక, డా. సరళ, జిల్లా సంక్షేమాధికారి మోతీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News