Home తాజా వార్తలు మ్యాన్‌హోల్‌లో పడి ఒకరి మృతి

మ్యాన్‌హోల్‌లో పడి ఒకరి మృతి

manholesహైదరాబాద్ : నగరంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మ్యాన్‌హోల్‌లో పడి ఓ యువకుడు చనిపోయాడు. మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు బాలికల వసతి గృహంలో మోతీయాదవ్(24) టీ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి మోతీయాదవ్ మాదాపూర్ పోలీసు స్టేషన్ సమీపంలోని రహదారి పక్క నుంచి వెళుతుండగా, అదుపు తప్పి పక్కనే ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయాడు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.