Friday, April 26, 2024

బెనజీర్, పాక్ మాజీ నేతలు మహాముదుర్లు

- Advertisement -
- Advertisement -

Female blogger has accused former Pakistani leaders

 

బెనజీర్ , పాక్ మాజీ నేతలు మహాముదుర్లు
అమెరికా లేడీ బ్లాగర్ రిచీ ఆరోపణలు

వాషింగ్టన్/ ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, ఇతర మాజీ నేతలపై ఓ మహిళా బ్లాగర్ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌లో పది సంవత్సరాలు ఉన్న సామాజిక మాధ్యమ స్టార్, స్త్రీవాది అయిన సింథియా రిచీ బ్లాగ్‌లు ఇప్పుడు పాకిస్థాన్‌లో దుమారం రేపాయి. మాజీ ప్రధాని భుట్టో, అప్పటి ఆరోగ్య మంత్రి తనను అన్ని విధాలుగా వేధించారని రిచీ ఆరోపించారు. ఇక మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మన్ మాలిక్ తనను రేప్ చేశారని పేర్కొన్నారు. వీటిని సంబంధిత నేతలవర్గాలు తీవ్రంగా ఖండించాయి. శుక్రవారమే రిచీ తమ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష వీడియోను పొందుపర్చారు. గతంలో మంత్రిగా ఉన్న ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రెహ్మన్ మాలిక్ లైంగికంగా తనను వేధించారని ఇందులో రిచీ తెలిపారు. ఇక మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ, మాజీ ఆరోగ్య మంత్రి మక్దూమ్ షహబుద్దిన్ తనను వేధించారని ఆమె ఆరోపించారు.

విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రెహ్మన్ తనను పిలిపించి అధ్యక్ష భవనంలోనే మత్తు మందు ఇచ్చి రేప్ చేశారని తెలిపారు. ఆరోపణలకు గురైన ముగ్గురు నేతలూ ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)కి చెందిన వారే. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నేతలు పాకిస్థాన్‌లోని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని , హత్యకు గురైన నాయకురాలు బెనజీర్ భుట్టోపై రిచీ మరింత తీవ్రస్థాయి ఆరోపణలకు దిగారు.

ఆమె చాలా క్రూరమైన వ్యక్తి అని, భర్త అసిఫ్ అలీ జర్దారీతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు అనుమానం వస్తే చాలు వారిని రేప్ చేయాలని తన వ్యక్తులను పురమాయించేదని , ఈ విధమైన ఘటనలు జరిగాయని పేర్కొన్న రిచీ వీటన్నింటికి సంబంధించి ఎటువంటి సాక్షాధారాలను పొందుపర్చలేదు. దీనితో ఇవన్నీ పూర్తి స్థాయి అరాచకపు ప్రేలాపనలు అని విమర్శకులు మండిపడుతున్నారు. సదరు మహిళ రిచీనే గత వారం తమ బ్లాగ్‌లో బెనజీర్ గురించి తాను రాసిన ‘ ఇన్‌డీసెంట్ కరస్పాండెంట్ సీక్రెట్ సెక్స్ లైఫ్ ఆఫ్ బెనజీర్ భుట్టో ’ పుస్తకంలోని కొన్ని భాగాలను పోస్టు చేశారు. ఇందులో బెనజీర్ విశృంఖల సెక్స్ జీవితం అనుభవించారని ఆరోపించడం సంచనలనం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News