Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) చెత్తకుప్పలో బంగారుతల్లి

చెత్తకుప్పలో బంగారుతల్లి

మృతదేహాన్ని పారేసిపోయిన కసాయి తల్లి            

గమనించిన కార్మికులు

పోలీసుల దర్యాప్తు

CHILD

మన తెలంగాణ / షాపూర్‌నగర్ : ఆడపిల్లను కాపాడాలని, ఆడపిల్లలున్న కుటుంబాలకు ప్రభుత్వం ‘బంగారు తల్లి’ పథకం ద్వారా ఆర్థికసాయాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నా శిశు మరణాలు ఆగడం లేదు. పుట్టి కొన్ని రోజు లైనా కాకముందే ఓ ఆడశిశువు తల్లి డండ్రులకు బరువైంది. తల్లి పేగు తెంచుకొని పుట్టిన మమకారమైనా ఆ కసాయి తల్లి తన బిడ్డను రోడ్డుపై చెత్తకుప్పలో పడేసి వెళ్లింది. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి లో ఈ దారుణం గురువారం ఉదయం  జరిగింది. కుత్బుల్లాపూర్ షాపూర్‌నగర్ ప్రధాన రహదారి పై ఉన్న హమాలీ అడ్డా వద్ద నాలాపై చెత్తకుప్పలో గుర్తు తెలి యని వ్యక్తులు ఆడ శిశువును పడేసి వెళ్లారు. ఉదయం 8 గంటలకు పని కోసం వచ్చిన హమాలి కార్మికుడు దేవదానం మూత్రశాలకు వెళ్తూ పక్కనే పడిఉన్న పసిపాపను గమ నించాడు. వెంటనే విషయాన్ని స్థానికులతో కలిసి జీడిమెట్ల పొలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్దలానికి చేరుకున్న పొలీసులు చిన్నారి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే పసిపాప మృతి చెందిఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని చిన్నారి శవాన్ని గాంధి ఆస్పత్రికి తరలించారు. అక్రమ సంతానమనో లేక ఆడశిశువు పుట్టిందనే కారణం తోనో ఎవరో ఈ చిన్నారిని చంపి పారేసి ఉంటారని జీడి మెట్ల పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పొలీసులు తెలిపారు.