అమరావతి: గర్భవతి, మహిళా ఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ పై మద్యం మత్తులో దుండగులు దాడి చేయడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి మాలపల్లి గ్రామంలో జరిగింది. ఉండవల్లి మాలపల్లిలో గూడవల్లి ఆనంద్, సునీత అనే దంపతులు దంపతులు నివసిస్తున్నారు. దంపతులు విజయవాడలో రైల్వే ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆదివారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా, తమ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి దుండగుడు ఢీకొట్టాడు. సునీత గర్భవతిగా ఉండడంతో భర్త ఆనంద్ బండి దిగి అతడితో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఉన్న దుండగుడు సునీత వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో వాడిని ఆమె చెప్పుతో కొట్టింది. 10 మంది రౌడీ గ్యాంగ్ అక్కడికి చేరుకొని దంపతులపై విచాక్షరహితంగా దాడ చేశారు.
దాడిలో గాయపడ్డ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. 5 నెలల గర్భవతినని చెప్పినా వినకుండా తమపై దాడి చేశారని తెలిపారు. మద్యం మత్తులో మా వాహనాన్ని ఢీకొట్టి తమపైనే దాడికి పాల్పడ్డారన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు, వాహనదారులను చంపేస్తామని బెదిరించారని, 10-15 మంది రౌడీ గ్యాంగ్‌ను పిలిచి, రాళ్ళతో తనని, తన భర్తను కనికరం లేకుండా కొట్టారని ఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ మీడియాకు తెలిపారు.