Home జోగులాంబ గద్వాల్ పంట పొలాల్లో పాత చీరలతో కంచె

పంట పొలాల్లో పాత చీరలతో కంచె

పందుల బెడద నుంచి కాపాడుకొనేందుకే చీరల కంచె

Saree1

ఇటిక్యాల: వర్షాలు సమృద్దిగా కురవడంతో రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపారు.గత సంవ త్సరం ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది లక్ష లు పెట్టుబడి పెట్టి అత్యధికంగా సాగు చేశారు. ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం కూరగాయల ధరలు గణణీయంగా పడిపో యాయి ఇదిలావుంటే జంతువుల భారీ నుండి పంటలను కాపాడుకునేందుకు రైతులు పాత చీరలను ఆధారంగా చేసు కుని కంచెను ఏర్పాటు చేసుకుంటున్నారు.మండల పరిధి లోని ఎర్రవల్లి చౌరస్తాలో చుట్టుపక్కల ఉన్న కూరగాయలు పండించే వ్యవసాయ భూములకు కంచెను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఈ పాత చీరలు జమ చేసుకుని వారి వ్యవ సాయ భూమిలోనికి ఎలాంటి జంతువులను రానివ్వకుండా పంటను కాపాడుకునేందుకు ఈ పాత చీరలతో కంచెను ఏర్సాటు చేసుకుంటున్నారు.ఎర్రవల్లి చౌరస్తాలో పందుల బెడద తీవ్రంగా ఉన్నందువల్ల వాటికి ఆహారం కోసం రైతులు పండించే కూరగాయల పంట పొలాలలోకి చేరి పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ పందులు రాత్రి సమయాల్లో ఎక్కు వగా వస్తుండడంతో, వారి పంటలను కాపాడుకునేందుకు ఈ పాత చీరలతో కంచెను ఏర్పాటు చేసుకుంటున్నారు.

పందుల యజమానులతో రైతులు పలుమార్లు తమ పంట పొలాల్లోకి పందులను రానివ్వకుండా చూసుకోవాలని మాట్లాడిన,ఎన్నిసార్లు చెప్పిన వారు మాత్రం పందులను విచ్చలవిడిగా వదులుతున్నారు. ఈ పందుల బెడద నుండి మమ్మల్ని కాపాడమని అధికారులను రైతులు కోరుచున్నారు. పంట పొలాలే కా కుండగా ఇండ్ల చుట్టూ చేరి ఇంటి పరి సరాలను నాశనం చేస్తున్నాయి.దీని వల్ల చిన్న పిల్లలకు పరిస రాలు హనికరంగా మారుతున్నాయి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్న కూడా పందుల స్వైర విరాహంతో అపరిశుభ్రం అవుతున్నాయి.చిన్న పిల్లలు,పెద్దలు,ముసలి వారు వీటి బెడదతో అనారోగ్యలపాలవుతున్నారు.

రైతులతో మాట్లాడగా..

పండించే పంట పొలాల్లో అధికంగా టమాటా,వంకాయ, బెండకాయ,పాలకూర ఇతర ఆకుకూరల పంటపొలాలను అధికంగా నాశనం చేస్తున్నాయని రైతులు వాపోయారు. రైతులకు తమ పంట పొలాల చుట్టూ కంచెను ఏర్పాటు చేసు కునటకు ప్రభుత్వం సబ్సిడితో జాలీలను రైతులకు అందజేస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు.

కూరగాయల ధరలు గతంలో ఇంతగా ఎప్పుడూ పడిపోలేదని రైతులు పేర్కొన్నారు.ప్రస్తుతం మార్కేట్లో కూర గాయలు కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.అలాగే హోటల్లలో గతంలో కూరగాయలను వందల కిలోల కొనుగోలు చేసేవారు సైతం ప్రస్తుతం చాలా తక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

గత సంవత్సరం ఈ సీజన్‌లో కూర గాయలు కిలో రూ.60రూపాయలకు పైగా ధర పలికాయని, కానీ ఈ సంవత్సరం కిలో కేవలం రూ.20 రూపాయల నుండి రూ.30రూపాయలు పలకడం చాలా గొప్పగా ఉందని రైతులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మా పంటలను కాపాడుకునేందుకు పందుల బెడదతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ పరిస్థితి ఎర్రవల్లి,చుట్టు ప్రక్కన గ్రామాల రైతుల పంట పొలాలకు పందుల బెడద ఎక్కువగా ఉందని అన్నారు.