Home రాష్ట్ర వార్తలు ఫీవర్ సిటీ

ఫీవర్ సిటీ

హైదరాబాద్ నగరంలో విజృంభించిన విషజ్వరాలు

fever-cityసిటీబ్యూరో: హైదరా బాద్ నగరాన్ని విషజర్వాలు వణికిస్తు న్నాయి. డెంగీ మలేరియా, కలరా, స్వైన్‌ప్లూ, డిఫ్తీరియా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. నగరం లో వరస భారీ వర్షాలు కురుస్తుండ డంతో మురుగు కాల్వలు, పొంగి ప్రవ హించడంతో పాటు అనేక బస్తీలు, కాల నీలు  జల దిగ్బంధనంలో చిక్కుకోగా, మరో వైపు ఇళ్ల మధ్య నీరు నిల్వ ఉండ డంతో దోమలు, ఈగలు పెరిగి విష జ్వరాల బాధి తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతూనే ఉంది. ఇప్పటికే డెంగీ బారిన పడి పదుల సంఖ్య లో మృత్యువాత పడగా, వేలాది మంది చికిత్స పొందుతున్నారు. ఏ ఆసుపత్రి లెక్కలు  చూసినా 75 శాతం మంది విష జ్వరాల బాధితులే ఉంటు న్నారు. సోమవారం విష జర్వాల బాధితులతో    ఫీవర్ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. దీంతో వైద్యులు మరో గంటల పాటు అదనంగా సమయం పొడగించి వైద్యం అందించారు. వేల మంది బాధితులు రావడంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడంతో పలువురు జ్వర తీవ్రతతో సొమ్మసిల్లిపోయ్యారు. సోమవారం ఒక్క రోజే ఫీవర్ ఆసుపత్రిలో 1487 మంది అవుట్ పేషంట్లుగా వైద్య సేవలను పొందగా, మరో 37 మంది ఆసుపత్రిలో చేరారు. ఈ నెలలలో ఇప్పటివరకు 31, 318 మంది అవుట్ పెషంట్లుగా 1037 మంది ఇన్ పేషెంట్లుగా వైద్య సేవలను పొందారు. కేవలం 7 రోజల్లోనే 9 వేలమంది ఆసుపత్రికి రావడమే విష జర్వాల తీవ్రతకు అద్దంపడుతోంది. మరో వైపు పేదలకు సూపర్ స్పెషలిటీ అసుపత్రులైన గాంధీ, ఉస్మానియాతో పాటు నగరంలోని ప్రాథమిక కేంద్రాలకు విష జ్వరాల బాధితుల తాకిడి పెరిగిపోయింది. వైద్య ఆరోగ్య శాఖ నగర వ్యాప్తంగా శని, అదివారల్లో 37 చొప్పున ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 14 వేల మందికి వైద్య సేవలను అందించారు. విష జర్వాల బాధితుల సంఖ్య నరగంలో లక్షల్లో ఉండడంతో బస్తీలు, కాలనీల్లోని చిన్న చిన్న క్లీనిక్‌లు మొదల్కోని కార్పోరేట్ ఆసుపత్రుల వరకు వేల సంఖ్యలో వైద్య సేవలను పొందుతున్నారు. మరో వైపు ప్రాణాంతాక డెంగ్యూ వ్యాధి సైతం అంతకు అంతా విజృంభిస్తుండడంతో అధికారికంగా 150 వరకు కేసులు నమోదు అయినప్పటీకీ అనాధికారికంగా మాత్రం వేయిలల్లో ఉంటున్నాయి.