Saturday, April 20, 2024

కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు…

- Advertisement -
- Advertisement -

 Trains

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తాజాగా రైల్వేశాఖపైనా కోవిడ్19 ప్రభావం పడింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యం.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తపి మేరకు దూర ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను రైల్వే శాఖ ఎప్పటికప్పుడు తీసుకుంటోంది. రైల్వే స్టేషన్లు, రైలు బోగీలను ఎప్పోటికప్పుడు శానిటైజ్ చేస్తున్నప్పటికీ రైళ్లను ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే పశ్చిమ రైల్వే దాదాపు పది రైళ్లకు సంబంధించి 35 ట్రిప్పులను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే సైతం పలు రైళ్లను రద్దు చేసింది.

ఒక రకంగా చెప్పాలంటే కరోనా సెగ రైల్వేకు గట్టిగానే తగిలిందనే చెప్పవచ్చు. తప్పనిసరైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని వైద్య నిపుణుల సూచనతో ప్రజలు రైళ్ల ప్రయాణానికి దూర మవుతున్నారు. తత్ఫలితంగా ఎసి రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య 25 శాతం తగ్గినట్లు దక్షణ మధ్య రైల్వే అధికారులు స్పష్టపరుస్తున్నారు. ప్రయాణీకులు లేకపోవడం వల్ల దక్షణ మధ్య రైల్వే పరధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి ముంబై, కర్నాటకలోని కలబురిగి, చెన్నైకి రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

మన దేశంలో ఇప్పటివరకు 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఒక్క మహారాష్ట్రలోనే 36 మందికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్ర మీదుగా వెళ్లే రైళ్లను ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఇక దేశంలో కరోనా ప్రభావంతో చనిపోయిన తొలి వ్యక్తి కర్ణాటకలోని కలబురిగికి చెందినవారు కావడంతో.. ఆ ప్రాంతంలో కూడా రైలు ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోయింది. సికింద్రాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే రైళ్లలోనూ ఆక్యూపెన్సీ పడిపోయింది. ఈ నేపథ్యయంలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 1 మధ్య 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

వివరాలు ః
కాకినాడ -టౌన్‌లింగంపల్లి (౦2775) మార్చి 31 వరకు, లింగంపల్లి-కాకినాడ(02776) మార్చి 31 వరకు, మచిలీపట్నం -సికింద్రాబాద్ (07049) మార్చి 22 నుంచి 29 వరకు, సికింద్రాబాద్‌-మచిలీపట్నం (07050) మార్చి 22 నుంచి 29 వరకు, యర్నాకులం-హైదరాబాద్ (07118) మార్చి 25.26 తేదీల్లో రద్దు, హైదరాబాద్‌-యర్నాకులం(07117) మార్చి 25,26 తేదీల్లో రద్దు, హైదరాబాద్‌-విజయవాడ (07257) మార్చి 23 నుంచి 30 వరకు, తిరుచునాపల్లి-హైదరాబాద్ (07609) మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకూ, హైదరాబాద్‌-తిరుచునాపల్లి(07610) మార్చి 25 నుంచి 30 వరకు, హెచ్‌ఎస్ నాందేడ్‌-ఔరంగాబాద్(17620) మార్చి 20 నుంచి 27 వరకూ, ఔరంగాబాద్‌-రేణిగుంట(17621) మార్చి 20 నుంచి 27 వరకు, రేణిగుంట-ఔరంగాబాద్ (17622) మార్చి 21 నుంచి 28 వరకు, తిరుపతి-చెన్నై సెంట్రల్ (16204) మార్చి 18 నుంచి 31 వరకు, చెన్నై సెంట్రల్‌-తిరుపతి(16203) మార్చి 18 నుంచి 31 వరకు, కాన్పూర్ సెంటర్‌-కాచిగూడ(04155) మార్చి 26వ తేదీ ఒక్కరోజే, కాచిగూడ-కాన్పూర్ (04156) మార్చి 27వ తేదీ ఒక్క రోజే. నిజామబాద్‌-పంధర్పూర్(51433), ఏప్రిల్ 1 నుంచి ౩౦ వరకు నిజామాబాద్- హెచ్‌ఎస్ నాంధేడ్ మధ్య తాత్కాలిక రద్దు, పంధర్పూర్‌-నిజామబాద్ (51434) ఏప్రిల్ 1 నుంచి 30 వరకు హెచ్‌ఎస్ నాంధేడ్‌-నిజామాబాద్ మధ్య తాత్కాలిక రద్దు. విల్లుపురం-సికింద్రబాద్ (0604౩) ఏప్రిల్ 1వ తేదీన రద్దు, సికింద్రాబాద్‌-విల్లుపురం(06044) ఏప్రిల్ 2వ తేదీన రద్దు, జబల్‌పూర్‌-తిరునవేళి(0174) మార్చి 26వ తేదీన రద్దు, తిరునవేళి-జబల్‌పూర్(01703) మార్చి 28వ తేదీన రద్దు.

దారి మళ్లింపు
గుంతకల్‌-గుత్తికల్లూరు మీదుగా వెళ్లే ఎనిమిది రైళ్లను దారి మళ్లించి గంతకల్‌-గొల్లపాల్యాముకల్లూరు మీదుగా పర్మినెంట్‌గా దారి మళ్లించ నున్నారు. వివరాలు ః యశంత్‌పూర్‌-అహ్మదాబాద్ (16502) మార్చి 22 నుంచి కల్లూరుగుల్లపాల్యాము-గుంతకల్ మీదుగా మళ్లింపు, అహ్మదాబాద్‌-యశ్వంత్‌పూర్(16501) మార్చి 24 నుంచి గుంతకల్‌-గొల్లపాల్యాముకల్లూరు మీదుగా మళ్లింపు, నాగర్‌కోయిల్‌-ముంబయి సిఎస్‌టి(16340) కల్లూరుగుల్లపాల్యాము-గుంతకల్ మీదుగా మళ్లింపు, ముంబయి సిఎస్‌టి-నాగర్‌కోయిల్(16339) మార్చి 18 నుంచి గుంతకల్‌-గొల్లపాల్యాముకల్లూరు మీదుగా మళ్లింపు, ముంబయి సిఎస్‌టి-తిరువనంతపురం(16331) మార్చి 23 నుంచి గుంతకల్‌-గొల్లపాల్యాముకల్లూరు మీదుగా మళ్లింపు, తిరువనంతపురం-ముంబయి సిఎస్‌టి (16332) మార్చి 21 నుంచి కల్లూరు గొల్లపాల్యాము-గుంతకల్ మీదుగా దారి మళ్లింపు, టుటికోరిన్‌ఓక్కా (19567) మార్చి 22 నుంచి కల్లూరుగొల్లపాల్యాము-గుంతకల్ మీదుగా దారి మళ్లింపు, ఓక్కాటుటికోరిన్(19568) మార్చి 19 నుంచి గుంతకల్‌-గొల్లపాల్యాముకల్లూరు నుంచి దారి మళ్లింపు.

మెరుగయ్యితేనే రైలు సర్వీసుల పునరుద్ధరణ
కరోనా ప్రభావం తగ్గి పరిస్థితి మెరుగుపడితే వెంటనే రైలు సర్వీసులు పునరుద్ధరించనుందని ఓ ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కరోనా ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు సర్వీసులను రద్దు, దారిమళ్లింపు తదితర చర్యలు చేపడుతున్న సంగతి విదితమే. అన్ని రంగాలతో పాటు రైల్వే శాఖపై సైతం కరోనా పెను ప్రభావం చూపిందని అంటున్నారు.

 

Few Trains cancelled with Corona Effect
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News