Home తాజా వార్తలు నాకౌట్‌లో స్పెయిన్, పోర్చుగల్

నాకౌట్‌లో స్పెయిన్, పోర్చుగల్

fifa

ఇరాన్ ఆశలు ఆవిరి
మాస్కో: రష్యా వేదికగా జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో యూరప్‌కు చెందిన అగ్రశ్రేణి జట్లు పోర్చుగల్, స్పెయిన్‌లు నాకౌట్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌బి నుంచి ఇరు జట్లు నాకౌట్ బెర్త్‌ను దక్కించుకున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌లను డ్రాగా ముగించిన స్పెయిన్, పోర్చుగల్‌లు ఐదేసి పాయింట్లతో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. మరోవైపు మొరాకో, ఇరాన్ జట్లు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. మొరాకోతో జరిగిన మ్యాచ్‌ను మాజీ చాంపియన్ స్పెయిన్ 22తో డ్రాగా ముగించింది. మరోవైపు ఇరాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పోర్చుగల్ డ్రాతో గట్టేక్కింది. ఇరు జట్లు నిర్ణీత సమయంలో 11తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు. గ్రూప్‌లో మూడేసి మ్యాచ్‌లు ఆడిన స్పెయిన్, పోర్చుగల్‌లు రెండేసి డ్రాలు, ఒక విజయంతో ఐదు పాయింట్లు సాధించాయి. స్పెయిన్ అగ్రస్థానంలో నిలువగా, పోర్చుగల్ రెండో స్థానంలో నిలిచింది. ఇరాన్ ఒక గెలుపు, ఒక డ్రాతో నాలుగు పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఒకవేళ పోర్చుగల్‌తో జరిగిన పోరులో విజయం సాధించి ఉంటే ఇరాన్‌కు నాకౌట్ బెర్త్ ఖాయమయ్యేది.
హోరాహోరీ…
ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్‌కు అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. తనకంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న పోర్చుగల్‌కు ఇరాన్ గట్టి పోటీ ఇచ్చింది. దూకుడుగా ఆడుతూ పోర్చుగల్‌ను హడలెత్తించింది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ సర్వం ఒడ్డింది. అయితే ఇరాన్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఇరాన్ దూకుడుగా ఆడుతూ పోర్చుగల్‌కు ముచ్చెమటలు పట్టించింది. పోర్చుగల్ కూడా గోల్ కోసం తీవ్రంగా శ్రమించింది. అయినా ఇరాన్ రక్షణ శ్రేణిని ఛేదించలేక పోయింది. అయితే ప్రథమార్ధం చివరి నిమిషంలో పోర్చుగల్ నిరీక్షణకు తెరపడింది. 45వ నిమిషంలో స్టార్ ఆటగాడు రికార్డో క్వరెస్మా అద్భుత గోల్‌తో పోర్చుగల్‌కు 10 ఆధిక్యాన్ని అందించాడు. క్వరెస్మా చేసిన గోల్ ప్రపంచకప్‌కే హైలైట్‌గా మారింది. రెండో హాఫ్‌లో కూడా పోర్చుగల్ దూకుడును కొనసాగించింది. వరుస దాడులతో ఇరాన్‌ను బెంబెలెత్తించింది. పదేపదే గోల్ బాక్స్‌వైపు దాడులు చేస్తూ గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అయినా పటిష్టమైన ఇరాన్ డిఫెన్స్‌ను ఛేదించి ముందుకు వెళ్లలేక పోయింది. ఇక ఇంజూరి టైమ్‌లో కరీమ్ అన్సారిఫర్డ్ చేసిన గోల్‌తో ఇరాన్ మ్యాచ్‌ను డ్రాగా ముగించగలిగింది. కరీమ్ 90+3 సమయంలో ఈ గోల్ చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇరాన్ నాకౌట్ ఆశలు నీరుగారాయి. మరోవైపు పోర్చుగల్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. పోర్చుగల్ నాకౌట్‌కు చేరడం ఇది నాలుగు సార్లు కావడం విశేషం. మరోవైపు ఇరాన్ ఇప్పటి వరకు ఐదు ప్రపంచకప్‌లు ఆడినా ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటి ముందుకు వెళ్లలేక పోయింది.
స్పెయిన్ ముందుకు…

fifawp
మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్ డ్రాతో గట్టెక్కింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌ను స్పెయిన్ అతి కష్టం మీద డ్రాగా ముగించింది. చివరి క్షణం వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరు అఖరుకు 22 గోల్స్‌తో సమమైంది. మ్యాచ్ డ్రా కావడంతో స్పెయిన్ ఐదు పాయింట్లతో గ్రూప్‌బిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ప్రారంభం నుంచే ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఖాలిద్ బౌతెబ్ అద్భుత ఆటతో మొరాకోకు మొదటి గోల్ అందించాడు. 14వ నిమిషంలోనే ఖాలిద్ ఈ గోల్ చేశాడు. అయితే ఈ ఆనందం మొరాకోకు ఎక్కువ సేపు నిలువలేదు. మరో ఐదు నిమిషాల తర్వా త స్పెయిన్ స్కోరును సమం చేసింది. ఇస్కో అద్భుత గోల్‌తో స్పె యిన్‌ను ఆదుకున్నాడు. ప్రథమార్ధంలో రెండు జట్లు 11తో స మంగా నిలిచాయి. ద్వితీయార్ధంలో కూడా ఇరు జట్లు సర్వం ఒడ్డాయి. అయితే చాలా సేపటి వరకు గోల్స్ సాధించడంలో విఫ లమయ్యాయి. 81వ నిమిషంలో మొరాకో ఆటగాడు యూసు ఫ్ నసరి అద్భుత గోల్‌తో జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో మొరాకో విజయం ఖాయంగా కనిపించింది. కానీ ఇంజూరి సమ యంలో లాగో అస్పాస్ అద్భుత గోల్‌తో స్పెయిన్‌ను ఆదుకున్నా డు. లాగో చేసిన గోల్‌తో స్పెయిన్ మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో సఫలమైంది.