Saturday, March 25, 2023

నీటికోసం మాటాల పోరు

- Advertisement -

old2

కాంగ్రెస్,టిఆర్‌ఎస్‌ల హోరు
మనతెలంగాణ/పెద్దపల్లి: ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వ నీళ్లకోసం కాంగ్రెస్,టీఆర్‌ఎస్ మధ్యవాటర్ వార్ తారా స్థాయికి చేరుకుంది.అధికార పార్టీకి చెందిన మంత్రులు ఈటెల రాజెందర్,హరీష్‌రావులు అక్రమంగా నీటిని తమ ప్రాంతాలకు తరలించుకు పోవడంవల్లే పెద్దపల్లి జిల్లాకు రావలసిన నీరు అందకుండా పోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తే,ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుండి తాము తగిన స్థాయిలో నీటిని విడుదల చేసినా ఎ గువ ప్రాంతంలో జగిత్యాల ఎంఎల్‌ఎ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అక్రమ మోటార్లను ప్రోత్సహించడం వల్లే నీరు దిగువ ప్రాంతమైన పెద్దపల్లి జిల్లాకు రాకుండా పోతోందని టిఆర్‌ఎస్ ప్రత్యారోపణ చేస్తోంది. ప్రభుత్వం మెడలు వంచి తమ వాటా తాము సాధించుకొని పంటలను కాపాడుకుంటామ నిమాజీ ఎంఎల్‌ఎ విజయరమణారావు అంటుండగా, ఆ యకట్టు చివరి భూములకు నీరందిస్తామని ఎంఎల్‌ఎ దా సరి మనోహర్‌రెడ్డి చెబుతున్నాడు. ఇద్దరూ రైతుల పంటల ను కాపాడుతామని చెబుతున్నా ఇప్పటి వరకు ఆ యకట్టు చివరి భూములకు తడి తగలక పోవడం కొసమెరుపు.

*అక్రమ నీటి తరలింపుతో జిల్లాకు ద్రోహం
మాజీ ఎంఎల్‌ఎ విజయ రమణారావు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి అక్రమంగా మద్యమానేరు ద్వారా మంత్రి హరీష్‌రావు సిద్దిపేట ప్రాంతానికి 15 టిఎంసిలను, జిల్లా మంత్రి ఈటెల రాజెందర్ దిగు వ మానేరు ద్వారా తమ ప్రాంతానికి 14 టిఎంసిలు త రలించడం వలనే పెద్దపల్లి జిల్లాకు నీరు అందడం లే దని మాజీ ఎంఎల్‌ఎ చింతకుంట విజయ రమణారావు ఆరోపిస్తున్నాడు. జిల్లాలో రభీలో లక్ష ఎకరాల్లో వరి ప ంట సాగుకు రైతులు నారు మళ్లు పోసుకొని 50 రోజు లు దాటినా నీరందక సగం కూడా నాట్లు పూర్తి కాలేదని సుల్తానాబాద్,ఓదెల,దర్మారం తదితర ప్రాంతాలలో నాట్లు వేసిన వరి పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దపల్లి ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి చేతగాని తనం వల్లే మంత్రులు అక్ర మ నీటి చౌర్యానికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి తమకు రావలసిన వాటాను సాధించుకుంటామని ఆయన అన్నాడు. ఇద్దరు మంత్రులు ఈ ప్రయోజనాల కోసం ఏకపక్షంగా వ్యవహరించి పెద్దపల్లి జిల్లా రైతాంగానికి అన్యా యం చేస్తున్నారని విజయరమణారావు ఆరోపించాడు.

*జీవన్‌రెడ్డి వల్లే పెద్దపల్లికి అన్యాయం
ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి
కాంగ్రెస్ నేత జగిత్యాల ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి అక్రమ మోటార్లను ప్రోత్సహించడం,తమ ప్రాంతలోని చెఱువులను నింపుతుండడంతో ప్రాంతంమైన పెద్దపల్లి జి ల్లాకు నీరు రావడం లేదని ఎంఎల్‌ఎ దాసరి మనోహర్ రెడ్డి అన్నాడు. 116 లెవల్ క్రాసింగ్ వద్ద 3 వేల క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా ఎగువ ప్రాంతం లో కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి నిర్వాకం వల్ల కేవలం 1400 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటె జీవన్ రె డ్డిని నిలదీయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నీటి రాజకీయానికి పాల్పడుతూ రైతులను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం రబీలో ఆరుతడి పం టలను వేసుకోవాలని ముందుగానే ప్రకటించినా రైతులు వరి పంటకు మొగ్గు చూపారని అన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయకట్టు చివరి భూములకు నీరందించి పం టలను కాపాడుతామని దాసరి పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News