Home తాజా వార్తలు అమ్మవారిని దర్శించుకున్న సినీ నిర్మాత దిల్‌రాజ్

అమ్మవారిని దర్శించుకున్న సినీ నిర్మాత దిల్‌రాజ్

Film producer Dil Raju

 

బాసర: భారత దేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో శుక్రవారం మంచి మూహూర్తం ఉండడంతో బాసర క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. గత రెండు రోజుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో భక్తులు తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణటక, సూదుర ప్రాంతాల నుంచి రైలు, బస్సు తమ తమ ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాన్ని దర్శించుకోని అనంతరం నేరుగా అమ్మవారి దర్శనానికి బయల్దేరగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దాదాపు దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. అటు ప్రత్యేక దర్శనాలు, సామాన్య భక్తులు అమ్మవారి దర్శనానికి బయల్దేరగా ఆలయంలోని తమ చిన్నారులకు అక్షరభాస్య మండపంతో పాటు, వంద అక్షరభ్యాస మండపంలో వేద పండితులు వేద మంత్రోలతో భారీ సంఖ్యలో అక్షర శ్రీకారాలు దిద్దారు.

 

Basara temple

 

అమ్మవారిని దర్శించుకున్న సినీ నిర్మాత దిల్‌రాజ్…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సినీ నిర్మత దిల్‌రాజ్ శుక్రవారం అమ్మవారి క్షేత్రంలో తమ కుటుంబ సమేతంగా దర్శించుకోని వారి కుమారుడికి అక్షరశ్రీకార పూజలను చేపట్టారు. వీరికి ఆలయాధికారులు ఆలయ మర్యదలతో స్వాగతం పలికి, గర్భగుడిలో కుంకుమార్చన ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం దిల్‌రాజ్ కుటుంబానికి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి, అమ్మవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఇటీవల విడుదలైన మహార్షి , సరిలేరు నీక్కేవరు మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్, చిరంజీవితో పాటు పలు సినిమాలను చిత్రీకరించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన దిల్‌రాజ్ బాసరకు రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో సెల్పీల కోసం ఎగ్గబడ్డారు. దీంతో ముందే రద్దీగా ఉన్న ఆలయం కాస్త ఇబ్బంది కరంగా మారింది.

Film producer Dil Raju family visits Basara temple