Friday, March 29, 2024

అబ్రహాం లింకన్ తర్వాత నేనే.. ట్రంప్, నువ్వో పెద్ద రేసిస్ట్‌వి.. బైడెన్

- Advertisement -
- Advertisement -

Final debate between Trump and Biden is over

 

కరోనా కట్టడిపైనా ఇరువురి మధ్య వాగ్వాదం
ఆసక్తికరంగా సాగిన ట్రంప్, బైడెన్ చివరి డిబేట్

వాషింగ్టన్: అమెరికా అంతా ఉత్కఠగా ఎదురు చూసిన అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య ఫైనల్ డిబేల్ ముగిసింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటలకు జరిగిన ఈ డిబేట్‌లో ప్రధానంగా ఆరు అంశాలు చర్చలోకి వచ్చాయి. ముందుగానే నిర్ణయించిన ఈ ఆరు అంశాలపై అభ్యర్థులిద్దరూ ప్రసంగించడమే కాకుండా ప్రత్యర్థిని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు కూడా సంధించారు. కరోనాపై పోరు, అమెరికా కుటుంబాల సంరక్షణ( హెల్త్‌కేర్), జాత్యహంకారం, పర్యావరణ మార్పులు, దేశ రక్షణ, నాయకత్వం..ఈ ఆరు అంశాలపై ట్రంప్, జో బైడెన్‌లు ముఖాముఖి తలపడ్డారు.

ఈ డిబేట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మ్యూట్ బటన్ వల్ల అభ్యర్థుల మధ్య గతంతో పోలిస్తే వాదోపవాదాలు కాస్త తగ్గాయి. ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుతగలడం వంటివి ఈ డిబేట్‌లో కనిపించలేదు.ఈ డిబేట్‌ను ఒక అవకాశంగా మలచుకొని నవంబర్ 3న జరగబేయే ఎన్నికల్లో గెలిచితీరాలని ట్రంప్ ప్రయత్నించారు. ఆదిశగానే తన ప్రసంగం ఉండేలా జాగ్రత్త పడ్డారు. గడచిన నాలుగేళ్లలో ఏం చేశారన్నది చెబుతూనే .. రాబోయే రోజుల్లో ఏం చేస్తాన్నది కూడా వివరించారు. జో బైడెన్ కూడా ఈ ఆరు అంశాలపై తన ప్రణాళికలను వివరించారు. ట్రంప్ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే తానేం చేస్తానన్నది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.

కరోనా మహమ్మారిపై పోరుతో ఈ 90 నిమిషాల చర్చ మొదలైంది. ముందుగా మాట్లాడిన ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఉండడంవల్లనే కరోనా తీవ్రత అమెరికాలో తక్కువగా ఉందని .. తానే లేకుంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ‘ కరోనా మహమ్మారి త్వరలో అంతం కాబోతోంది. నేను కరోనానుంచి కోలుకున్నా. నాలాగే అందరూ కరోనానుంచి బైటపడతారు. అందరికీ రోగనిరోధక శక్తి వస్తుంది. అప్పుడు కరోనా మనల్ని ఏమీ చేయలేదు. మనం దేశంనుంచి ఈ కరోనాను తరిమిగొట్టబోతున్నాం.మరికొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ వస్తుంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలకు చర్చను నిర్వహిస్తున్న సమన్వయకర్త ఎన్‌బిసి న్యూస్ కరస్పాండెంట్ క్రిస్టీన్ వెల్కర్ అడ్డుతగిలారు. మరికొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందనడానికి సాక్షాలు చూపించాలని కోరారు. దీనికి ట్రంప్ సమాధానమిస్తూ, ‘ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి నేను చెప్పింది అమెరికన్లకు నేను ఇస్తున్న కాదు..ఓ ఆశ. వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని శాస్తరజ్ఞులు చెబుతున్నారు. అదే నేనూ చెబుతున్నా.

కరోనాతో కలిసి బతకడం తప్పనిసరి. అన్ని వ్యవస్థలను కరోనాకు పూర్వం ఉన్న స్థితికి తేవలసిన అవసరం ఉంది. లేకపోతే అమెరికా ఆర్థికంగా మరింత నష్టపోతుంది. ఈ కరోనా విపత్తుకు నన్ను బాధ్యత వహించమని అంటున్నారు. నేనే బాధ్యత వహిస్తాను. అయితే దీనికి అసలు కారణం చైనా. ఈ విపత్తుకు నేనో, జో బైడనో, అమెరికాలోని ఏ ఒక్క పౌరుడో కారణం కాదు. అసలు దోషి చైనాయే’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత మాట్లాడిన జో బైడెన్ ‘ కరోనాతో కలిసి జీవించాలంటున్నారు. ఇక్కడ ప్రజలు చనిపోతున్నారు అధ్యక్షా.. నేను అధికారంలోకి వస్తే అమెరికాను కాదు.. వైరస్‌ను షట్‌డౌన్ చేస్తా. ఈ కరోనా మహమ్మారి విజృంభించడానికి, రెండు లక్షల మంది అమెరికన్ల మరణానికి కారణమైన ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండడానికి అర్హుడు కాడు.

మనం మరిన్ని చీకటి రోజులను ఎదుర్కోబోతున్నాం, కరోనాను కంట్రోల్ చేయడానికి, వ్యాక్సిన్ పంపిణీకి ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు.ప్రజలను గాలికి వదిలేశారు’ అంటూ దుయ్యబట్టారు. కరోనా తర్వాత హెల్త్‌కేర్‌పై చర్చ జరిగింది. ఒబామా హెల్త్‌కేర్‌ను రద్దు చేసి దానికన్నా మెరుగైన పాలసీని తీసుకొచ్చానని ట్రంప్ చెప్పగా, అమెరికన్ల ఆరోగ్యానికి సంబంధించి ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని బైడెన్ అన్నారు. ఒబామా హెల్త్‌కేర్ పాలసీతో పాటుగా బైడెన్ కేర్‌ను కూడా రూపొందిస్తామని బైడెన్ చెప్పుకొచ్చారు. హెల్త్‌కేర్ అనేది ప్రతి అమెరికన్ హక్కని ఆయన తేల్చి చెప్పారు.

జాత్యహంకారం అంశంపై ట్రంప్, బైడెన్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘ఈ గదిలో.. ఇక్కడ ఉన్న వారిలో అత్యంత తక్కువ జాత్యహంకారం ఉన్న వ్యక్తిని నేనే. నల్ల జాతీయులకు నేను చేసినంత సేవ ఇంతవరకు ఏ అధ్యక్షుడూ చేయలేదు. అప్పట్లో అబ్రహాం లింకన్ నల్ల జాతీయుల అభ్యున్నతికి దోహదం చేశారు. ఆయన తర్వాత వారి అభ్యున్నతికి నేనే ఎక్కువ కృషి చేశా..’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఓ నల్లజాతి మహిళ ప్రశ్నకు పమాధానంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వలసదారులను ఒబామమా సర్కార్, అప్పటి ఉపాధ్యక్షుడైన బైడెన్ ఎంత చిత్రహింసలకు గురి చేశారో అంటూ చర్చను పక్కదోవ పట్టించడానికి యత్నించారు. అయితే ట్రంప్ కామెంట్లపై బైడెన్ వెరైటీగా స్పందించారు. తనను తాను దివంగత అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌తో ట్రంప్ పోల్చుకోవడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘ అత్యంత ప్రమాదకర జాత్యహంకారిగా అబ్రహాం లింకన్‌ను ఆధునిక అమెరికా సమాజం చూస్తోంది.

ప్రతి అమెరికన్ పౌరుడిలో జాత్యహంకార భావాలను ఆయన రెచ్చగొట్టారు’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. బైడెన్ వ్యాఖ్యలకు ట్రంప్ వెంటనే స్పందిస్తూ ‘ అబ్రహాం లింకన్‌ను జాత్యహంకారి అనడానికి మీ దగ్గర సాక్షాలున్నాయా? ఏ ఆధారాలను బట్టి మీరు ఈ ఆమెంట్స్ చేశారు, దీనికి మీరు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది’ అని అన్నారు. దీనికి బైడెన్ చాలా కూల్‌గా ‘ నేను ఆధునిక అబ్రహాం లింకన్‌ను అని నువ్వేకదా చెప్పుకున్నావు’ అని ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి ట్రంప్ తడబడుతూ ‘ నోనో నేను అలా అనలేదు.. అబ్రహాం లింకన్ తర్వాత నల్ల జాతీయులైన అమెరికన్లకు నేను చేసినంత సేవ మరే అధ్యక్షుడు చేయలేదని మాత్రమే అన్నాను’ అంటూ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో జే బైడెన్ ట్రంప్ పాలనపై నిప్పులు చెరిగారు.

ఆయన పాలనలో ఎన్ని జాత్యహంకార దాడులు జరిగాయో లెక్కలేదన్నారు.అమెరికన్లలో జాత్యహంకార విషబీజాలను ట్రంప్ నాటుతున్నారు. మేము అధికారంలోకి వస్తే ఇలాంటి సంఘటనలు జరగడానికి తావివ్వం. వలసదారుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తాం’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వస్తే కోటిమందికి పైగా వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తానని బైడెన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం మాద వీరిరువురి మధ్య జరిగిన తొలి డిబేట్ పరస్పర వ్యక్తిగత ఆరోపణలతో రసాభాసగా ముగియగా, రెండో డిబేట్ మాత్రం ఇరువురికి కొంత ప్రయోజనం చూకూర్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News