Home జగిత్యాల కాంగ్రెస్ నేతలు అధికారం లేకుంటే బతకరు…

కాంగ్రెస్ నేతలు అధికారం లేకుంటే బతకరు…

Etela

* అధికారం కోసమే కాంగ్రెస్ నేతల మొసలి కన్నీరు
* జగిత్యాల జిల్లాకు మా పార్టీ ఎంఎల్‌ఎ లేక పోవచ్చు… కానీ మేమంతా ఉన్నాం
* రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్

జగిత్యాల: 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన జనహిత ప్రగతి వేదిక సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తెలంగాణ అభివృద్ధికి లక్షలాది కోట్ల నిధులు వెచ్చించి బంగారు తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. పార్టీలకతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూత్న పథకాలు అమలు చేసి అందరి ముఖాల్లో చిరునవ్వులు నింపిన మహనీయుడు కెసిఆర్ అని అన్నారు.

రైతుల రుణాలు రూ.17 వేల కోట్లు మా ఫీ చేశామని, ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే ఆ దర్శంగా నిలిచిందన్నారు. రైతుల కరెంట్ కష్టాలు తీ ర్చేందుకు 9గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 12 గంటల విద్యుత్‌ను అం దిస్తూ రైతుల కరెంట్ కష్టాలను తొలగించామన్నారు. 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ దుష్ట పరిపాలన సాగించిందన్నారు. ఆ పార్టీ నాయకులు అధికారం లేకుంటే బతకలేరని, అధికారం కోసం ఎంతటి మోసాలకైనా పాల్పడతారన్నారు. అధికారమే ధ్యేయంగా ప్రజల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ లేకపోవచ్చు… ఇద్దరు మంత్రులం ఉన్నాం… ముగ్గురు ఎంపిలు ఉన్నారు… 10 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. మేమంతా కలిసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు. జగిత్యాల మున్సి పాలిటీకి మంత్రి కెటిఆర్ రూ.50 కోట్లు కేటాయించడం హర్షనీయమని, జిల్లా అభివృద్దికి ఎన్ని నిధులు కావాల్సి వస్తే అన్ని నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. టిఆర్‌ఎస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు చాల సంతోషంగా ఉన్నారని, బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ పిలుపునిచ్చారు