Saturday, April 20, 2024

ఆ సిఎంల నుంచే ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

Financial help from those CMs: Prashant Kishor

ప్రశాంత్ కిశోర్ వెల్లడి

పాట్నా: ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నవారితోసహా తన పాత క్లయింట్స్ బీహార్‌లో తాను చేపట్టిన జన సురాజ్ ప్రచార యాత్రకు ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. పాట్నాకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఇండో-నేపాల్ సరిహద్దులోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతమైన వాల్మీకి నగర్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. అక్టోబర్ 2న ప్రశాంత్ కిశోర్ తన పాదయాత్ర ప్రారంభించారు. బీహార్‌లోని మారుమూల ప్రాంతాలను సైతం సందర్శించాలని ఆయన సంకల్పించారు. 3,500 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్ర అనంతరం ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలన్నది ఆయన లక్షం. ఈ పాదయాత్రకు బిజెపి ఆర్థిక నిధులను సమకూరుస్తోందని జెడి(యు) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో దీనిపై విలేకరులు ప్రశాంత్ కిశోర్ వివరణ కోరగా,గడచిన దశాబ్ద కాలంలో తాను 10 ఎన్నికలకు తన సర్వీసులను అందచేశానని, ఒక్క ఎన్నిక మినహా అన్ని ఎన్నికల్లో తాను సర్వీసులు అందచేసిన పార్టీ విజయం సాధించిందని చెప్పారు. తాను సహాయం చేసిన కనీసం ఆరుగురు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నారని, మీడియా నమ్మినా నమ్మకున్నా తాను వారి నుంచి ధనం స్వీకరించలేదని, అయితే ఇప్పడు ఈ పాదయాత్రకు వారి నుంచి ఆర్థిక సహాయాన్ని తీసుకుంటున్నానని కిశోర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News