Home మన ఆరోగ్యం ఈ బుడతడిని గుర్తుపట్టారా? ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఇతనొకడు…

ఈ బుడతడిని గుర్తుపట్టారా? ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఇతనొకడు…

Hero-Ram

పై ఫోటోలో కూలింగ్ గ్లాసులతో స్టైలిష్ గా ఫోటోకు  పోజిచ్చిన ఈ బుల్లి హీరోను గుర్తుపట్టారా?. అతనెవరో చెప్పగలరా? టాలీవుడ్ లో తొలి సినిమాతోనే సంచనాలు క్రియేట్ చేసిన స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్‌ హీరో అతడు. ఇంకా గుర్తుకు రాలేదు కదూ. అతడేవరో కాదు. తనదైన చలాకీ నటన, స్పీడ్ డ్యాన్సులతో సినీ అభిమానులను అలరించి ఎనర్జిటిక్‌ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ పొతినేని. అదేనండి రామ్. ఆయన శనివారం తన ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు.

‘ఇలాంటి ఫొటోలు మన గ్రాండ్‌ పేరెంట్స్‌ వద్ద దొరుకుతాయి. 1989.. 365 రోజుల వయసు’ అని ట్వీట్‌ చేశారు. దేవదాస్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన రామ్ ఆ తరువాత రెడీ, కందిరీగ, నేను శైలజ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం నేను శైలజతో తనకు మంచి హిట్ ను అందించిన దర్శకుడు కిశోర్‌ తిరుమలతో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్‌, మేఘా ఆకాశ్‌ రామ్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్రవంతి రవి కిశోర్‌ నిర్మాత. ఈ చిత్రంలో రామ్‌ కొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నారు.