Home తాజా వార్తలు మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డికి జ‌రిమానా

మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డికి జ‌రిమానా

Fine To Ex Hyderabad Mayor Teegala Krishnareddyహైద‌రాబాద్ : క‌రోనా క‌ట్ట‌డికి మాస్కు ధ‌రించాల‌ని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కారులో వెళ్లినా విధిగా మాస్కులు ధరించాలని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు మాస్కులు ధరించకుండా బయటకు వస్తున్నారు.  స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు క‌ర్మ‌న్‌ఘాట్ చౌర‌స్తా వ‌ద్ద మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. వాహనాల్లో వెళ్తూ మాస్కు ధ‌రించ‌ని వారికి  జ‌రిమానా విధించారు. పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో హైదరాబాద్ మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణా రెడ్డి త‌న కారులో వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆపారు. మాస్కు ధ‌రించ‌ని తీగ‌ల కృష్ణారెడ్డికి ఎస్ఐ ముఖేష్ రూ. 1000 జరిమానా విధించారు. దీంతో ఎస్ఐ ముఖేష్, తీగల మధ్య వాగ్వాదం జరిగింది. కారులో వెళుతున్నా, మాస్క్ ధరించాల్సిందేనని ఎస్ఐ ముఖేష్ తేల్చిచెప్పడంతో తీగల జరిమానా చెల్లించి వెళ్లిపోయారు.