Home Default ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

Fire Accidentఢిల్లీ : ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్ లోని ప్లాట్‌ఫాం 8లో నిలిపి ఉంచిన ఛండీగర్ – కూచువల్లి ఎక్స్ ప్రెస్  లో  మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రైలు పూర్తిగా దగ్ధమైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Fire Accident At Delhi Railway Station