Home మెదక్ ప్రమాదవశాత్తు కారు, రెండు బైకులు దగ్దం

ప్రమాదవశాత్తు కారు, రెండు బైకులు దగ్దం

Brunted-Carమనతెలంగాణ/వెల్దుర్తి: ఇంటి ముందు పార్క్ చేసిన కారు, రెండు బైకులు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాధకర ఘటన మండల పరిధి ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. కారులో ఆడుకుంటున్న చిన్నారులు బయటకు వచ్చిన కొద్ది సేపటికే ప్రమాదం చోటుచేసుకోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సత్యపాల్‌రెడ్డి తన కారు, బైకుతో పాటు తన తండ్రి పేరిట ఉన్న మరో బైకును రోజువారి మాదిరిగా శుక్రవారం రాత్రి తన ఇంటిముందు పార్కింగ్ చేసాడు. ఈ క్రమంలోనే కారులో అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు చుట్టుప్రక్కల వారి సాయంతో ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా కారు ప్రక్కనే నిలిపిన రెండు బైకులకు వ్యాపించాయి. ఈ ఘటనలో కారుతో పాటు రెండు బైకులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో పాటు రేకుల షెడ్డు కూడా పాక్షికంగా దెబ్బతింది. నర్సాపూర్ నుండి అగ్నిమాపక వాహనం వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పెంటయ్య తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.