Tuesday, April 23, 2024

‘ఆదిపురుష్’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’‌ సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలోని ఓ స్టూడియోలో మంగళవారం ఈ సినిమా రెగ్యూలర్ చిత్రీకరణ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే, షూటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే సెట్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో గ్రీన్‌ స్క్రీన్‌ సెట్టింగ్‌ పూర్తిగా దగ్ధమైంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయపడనట్లు తెలుస్తోంది. అయితే, భారీగా ఆస్థినష్టం జరిగినట్లు సమాచారం. ముహూర్తపు షాట్‌ రోజునే సెట్‌లో అగ్నిప్రమాదం జరగంతో చిత్రయూనిట్ షాక్ కు గురైంది. కాగా, ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. సీత పాత్రలో కృతి సనన్ నటించనుందని ప్రచారం జరుగుతోంది.

Fire accident at Prabhas’s Adipurush Shooting spot

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News