Home తాజా వార్తలు వేములవాడలో అగ్నిప్రమాదం

వేములవాడలో అగ్నిప్రమాదం

Fire Accident at Vemulawadaరాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ సమీపంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. జాతర గ్రౌండ్‌లోని గోశాల వద్ద రెండు దుకాణాల్లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో శేఖర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన శేఖర్ ను ఆసుపత్రికి తరలించారు. 2 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. ఈ దుకాణాలకు దుండగులు నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fire Accident at Vemulawada