Home తాజా వార్తలు కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం…

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం…

Fire Accidentసంగారెడ్డి: పటాన్‌చెరు మండలం పాశమైలారం వద్ద ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడడంతో పక్కనే ఉన్న మరో రెండు పరిశ్రమలకు వ్యాపించాయి. స్థానికులు సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న 5 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనతో భారీగా ఆస్తి నష్టం సంభవించిదని ఫ్యాక్టరీల యజమానులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Fire Accident in Chemical Factory At Patancheru