Home తాజా వార్తలు పత్తి గోదాంలో మంటలు…

పత్తి గోదాంలో మంటలు…

 Cotton Warehouse

 

నాగర్‌కర్నూల్‌లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఉన్న బాలాజీ వేర్ హౌస్ రూరల్ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోదాంలో నిల్వ ఉన్న 5వేల పత్తి బేళ్లు పూర్తిగా కాలిపోయా యి. తెల్లవారుజామున గోదాం లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని అక్కడే ఉన్న వాచ్‌మెన్ గుర్తించి గోదాం నిర్వహకులకు సమాచారాన్ని తెలిపారు.

నిర్వహకులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలుపగా త్వరతగతిన రెండు ఫైర్‌ఇంజన్‌లతో ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో 13కోట్ల రూపాయల విలువ చేసే పత్తి పూర్తిగా దగ్ధమయ్యింది. షాట్‌సర్కూట్ వల్ల ప్రమాదం సంభవించిందని నిర్వహకులు తెలిపారు. సంఘటన స్థలాన్ని జెసి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్ రెడ్డి పరిశీలించారు. సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై భగవంత్ రెడ్డిలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Fire Accident in Cotton Warehouse